తేదీ 14.02.2023 మంగళవారం, రాశిఫలాలు.. ఈ రాశివారికి ఆకస్మిక ధనయోగం..!
మేషం : క్రీడాకారులకు శ్రమ ఎక్కువ. విలువైన వస్తువులను నష్టపోదురు. మనస్సులో తెలియని ఆందోళన వుండవచ్చును. చేసే పనుల యందు ఆసక్తి వుండదు. శరీర బాధలు కలుగవచ్చును. వృషభం : ఏ పనిలో ఉన్న సంతోషాన్ని పొందుతారు, కుటుంబ మూలక సౌఖ్యం కలుగుతుంది. స్థిరాస్థి ప్రయత్నాలు ఫలిస్తాయి. విందు, వినోదాలలో పాల్గొంటారు. రావలసిన ధనం చేతికందుతుంది. మిథునం : మీ అంచనాలు నిజమౌతాయి. వివాదాలలో పైచేయి సాధిస్తారు. దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది. శుభవార్తలను వింటారు. […]

మేషం : క్రీడాకారులకు శ్రమ ఎక్కువ. విలువైన వస్తువులను నష్టపోదురు. మనస్సులో తెలియని ఆందోళన వుండవచ్చును. చేసే పనుల యందు ఆసక్తి వుండదు. శరీర బాధలు కలుగవచ్చును.
వృషభం : ఏ పనిలో ఉన్న సంతోషాన్ని పొందుతారు, కుటుంబ మూలక సౌఖ్యం కలుగుతుంది. స్థిరాస్థి ప్రయత్నాలు ఫలిస్తాయి. విందు, వినోదాలలో పాల్గొంటారు. రావలసిన ధనం చేతికందుతుంది.
మిథునం : మీ అంచనాలు నిజమౌతాయి. వివాదాలలో పైచేయి సాధిస్తారు. దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది. శుభవార్తలను వింటారు. విద్యార్థులు నూతన పుస్తకాలు సంగ్రహిస్తారు.
కర్కాటకం : సోమరితనం వలను కార్య భంగములుండవచ్చును. జ్వరాది శరీరబాధలు కలుగవచ్చును. ప్రయాణములు మూలకంగా ధనవ్యయము వుంటుంది. మనోవ్యధ కలుగవచ్చును.
సింహం : వాహనమూలకంగా భయము. తొందరపాటు నిర్ణయముల వలన ఇబ్బందులు కలుగవచ్చును. తలపెట్టిన కార్యములకు విఘ్నములు కలుగుతుంటాయి. భయం అధికంగా వుంటుంది.
కన్య : భార్య తరుపు బంధువుల మూలకంగా లాభములుంటాయి, వివాహప్రయత్నములు ఫలిస్తాయి. శుభ కార్యములను ఆచరిస్తారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. మనోధైర్యంతో కార్యజయములు సాధిస్తారు.
తుల : శరీరములో తాపము ఎక్కువగా వుంటుంది. ఉమ్మడి స్థిరాస్థుల మూలకంగా అశాంతి కలుగవచ్చును. గతంలో చేసిన పొరపాట్లు వేధిస్తాయి, ఉద్రేకం కలుగుతుంది.
వృశ్చికం : వృత్తి, ఉద్యోగరీత్యా గౌరవమర్యాదలు పెరుగుట. పెద్దలను కలుసుకొందురు. బహు మానములను పొందుదురు. ఒక ఆపద నుంచి బయటపడుదురు. దైవ దర్శనములు ఉల్లాసాన్ని కలిగిస్తాయి.
ధనుస్సు : ప్రయాణమూలకంగా ధనవ్యయం కలుగుతుంది. పండితులు, ఉపాధ్యాయులకు తగిన గౌరవం అభించదు. బంధుమిత్రుల మూలకంగా అశాంతి ఏర్పడవచ్చును. అపవాదులు బాధిస్తాయి. ప్రయత్నకార్యాలు ఆలస్యమౌతుంటాయి.
మకరం : చర్చలలో మీ మాట చెల్లుబాటవుతుంది. గృహములో శుభకార్యాలు ఉల్లాసాన్నిస్తాయి. ఇష్టమైన వ్యక్తుల కలయిక ఆనందాన్నిస్తుంది. వర్తక, వ్యవహారాల మూలకంగా లాభాలుంటాయి.
కుంభం : శరీర బాధల నుంచి ఉపశమనం కలుగుతుంది. దూరప్రాంతం నుంచి శుభవార్తలు వింటారు, నూతన వస్తులాభము కలుగుతుంది. నూతన పరిచయాలు లాభిస్తాయి. విదానములు పరిష్కారమౌతాయి.
మీనం : ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది, కోర్టు వ్యవహారాలలో ఊహించని పరిణామాలు కలుగుతాయి. వివాదాలను ధైర్యంగా ఎదుర్కొంటారు. నూతన ప్రయత్నములు అనుకులిస్తాయి, బంగారు వస్తువులను కొనుగోలు చేస్తారు.