JNJ సొసైటీలో సభ్యులందరికీ ఇళ్లు.. సందేహాలు వద్దు: ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌

విధాత: పదిహేనేళ్లుగా పెండింగ్‌లో ఉన్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చూపిన చొరవను అభినందిస్తూ jnj హౌసింగ్ సొసైటీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఇవాళ ఆర్టీసీ కళ్యాణ మండపంలో జరిగిన జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షుడు చంటి క్రాంతి కిరణ్ మాట్లాడుతూ జర్నలిస్టులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక అభిమానం ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ద […]

  • By: krs    latest    Nov 05, 2022 5:46 PM IST
JNJ సొసైటీలో సభ్యులందరికీ ఇళ్లు.. సందేహాలు వద్దు: ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌

విధాత: పదిహేనేళ్లుగా పెండింగ్‌లో ఉన్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చూపిన చొరవను అభినందిస్తూ jnj హౌసింగ్ సొసైటీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఇవాళ ఆర్టీసీ కళ్యాణ మండపంలో జరిగిన జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ సర్వసభ్య సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షుడు చంటి క్రాంతి కిరణ్ మాట్లాడుతూ జర్నలిస్టులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక అభిమానం ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ద వహించిన ఫలితమే కేసులో త్వరిత గతిన పరిష్కారం లభించిందన్నారు.

తాను జర్నలిస్టుగా జీవితం ప్రారంభించామని ఎమ్మెల్యేగా ఎన్నికైన తాను జర్నలిస్టుల వైపే ఉంటానని, అందరు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇప్పించే బాధ్యతను తాను తీసుకుంటానని అన్నారు. jnjకు కేటాయించిన స్థలం పూర్తిగా సొసైటీకే చెందుతుందని సభ్యులు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని కోరారు.

అనంతరం పల్లె రవి మాట్లాడుతూ జర్నలిస్ట్ ఇళ్ల స్థలాలపై ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందన్నారు. jnj సొసైటీలో సభ్యులందరికీ ఇళ్లు వస్తాయని ఇందులో ఎలాంటి సందేహాలకు తావు లేదని అన్నారు. సీఈవో వంశీ మాట్లాడుతూ జే.ఎన్.జే సొసైటీ ఇళ్ల స్థలాల తీర్పు దేశవ్యాప్త జర్నలిస్టుల జీవితాలకు ప్రయోజనకారిగా అయిందన్నారు.

జర్నలిస్టుల జీవిత స్థితిగతులను పరిగణలోకి తీసుకొని అప్పటి చీఫ్ జస్టిస్ ఎన్పీ రమణ గారు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమని అన్నారు. జస్టిస్ రమణ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ సర్వసభ్య సమావేశం ప్రత్యేక తీర్మానం చేసింది. ఇంకా ఈ సమావేశంలో నేమాని భాస్కర్, రవికాంత్ రెడ్డి, జ్యోతి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.