Rekha Naik | కన్వర్టెడ్ క్రిస్టియన్ ఎస్టీ ఎలా అవుతాడు? BRS అభ్యర్థి జాన్సన్ నాయక్‌పై.. ఎమ్మెల్యే రేఖ సంచలన వ్యాఖ్యలు
Rekha Naik | కేసీఆర్ తడిగుడ్డతో గొంతు కోశాడని ఆవేదన ఖానాపూర్ గడ్డమీద బీఆర్ఎస్ ను ఓడిస్తా.. విధాత ప్రతినిధి, ఉమ్మడి అదిలాబాద్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ టికెట్ వివాదం రాజుకుంటూనే ఉంది. సిటింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్, బీఆర్ఎస్ నాయకుడు భూక్యా జాన్సన్ నాయక్ గత కొన్ని రోజులుగా పోటీపడుతూ వచ్చారు. పార్టీ అధిష్టానం ఎట్టకేలకు సిటింగ్ స్థానాన్ని కాదని, జాన్సన్ నాయక్ వైపు మొగ్గు చూపింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రేఖా […]

Rekha Naik |
- కేసీఆర్ తడిగుడ్డతో గొంతు కోశాడని ఆవేదన
- ఖానాపూర్ గడ్డమీద బీఆర్ఎస్ ను ఓడిస్తా..
విధాత ప్రతినిధి, ఉమ్మడి అదిలాబాద్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ టికెట్ వివాదం రాజుకుంటూనే ఉంది. సిటింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్, బీఆర్ఎస్ నాయకుడు భూక్యా జాన్సన్ నాయక్ గత కొన్ని రోజులుగా పోటీపడుతూ వచ్చారు. పార్టీ అధిష్టానం ఎట్టకేలకు సిటింగ్ స్థానాన్ని కాదని, జాన్సన్ నాయక్ వైపు మొగ్గు చూపింది.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రేఖా నాయక్ మండి పడుతున్నారు. బీఆర్ఎస్ టికెట్ తీసుకున్న జాన్సన్ నాయక్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జాన్సన్ నాయక్ కు టికెట్ తీసుకునే అర్హత లేదని తెలిపారు. ఆయన కన్వర్టెడ్ క్రిస్టియన్ అని, ఎస్టీ సామాజిక వర్గానికి చెందినవాడు కాదని ఆరోపించారు. అతనికి ఎలా టికెట్ ఇస్తారని బీఆర్ఎస్ పార్టీ అధిష్టానాన్ని ప్రశ్నించారు.
వారి తాతలు, ముత్తాతల నుండి క్రిస్టియన్ లోకి మారారని, అలాంటి వారికి ఎస్టీ రిజర్వ్ స్థానం నుండి టికెట్ కేటాయించడంపై ఆమె అభ్యంతరం తెలిపారు. సర్వేలు జరిపారే తప్ప, ప్రజలు ఏవరి వైపు ఉన్నారనే విషయాన్ని గమనించలేదని, కేవలం స్నేహాలు, పరిచయాలకే టికెట్లు ఇచ్చారని ఆరోపించారు.
సీఎం కేసీఆర్ నమ్మించి గొంతు కోశారని ఆక్రోశం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి ని ఓడించి, ప్రజా క్షేత్రంలోనే గుణపాఠం చెబుతానాని పేర్కొన్నారు. నేను జనంలో తిరుగుతూ ప్రజా సంక్షేమం కోసం పాటుపడ్డాడని, టికెట్ రాజకీయాలు తనకు తెలియవని చెప్పుకొచ్చారు.
50 రోజులు తను ఎమ్మెల్యేగా కొనసాగుతానని, ప్రజా సంక్షేమం కోసం ప్రజల్లోనే ఉంటానని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో ఖానాపూర్ నియోజకవర్గంలో పోటీ చేసి బీఅరెస్ అభ్యర్థిని ఓడిస్తానని తెలిపారు.