Paytm FASTag | పేటీఎం ఫాస్టాగ్ ఉందా..? డీయాక్టివేషన్ ఎలా చేయాలో తెలుసా?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షల నేపథ్యంలో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) అధికృత బ్యాంకుల జాబితా నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ను తొలగించింది

Paytm FASTag | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షల నేపథ్యంలో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) అధికృత బ్యాంకుల జాబితా నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ను తొలగించింది. మార్చి 15 తర్వాత ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణం కొనసాగించేందుకు ఆర్‌బీఐ జాబితాలో ఉన్న 32 ఆధికృత బ్యాంకుల నుంచే ఫాస్టాగ్ తీసుకోవాల్సి ఉంటుంది.
ఐహెచ్‌ఎంసీఎల్ పేర్కొన్న జాబితాలో ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఎస్‌బీఐ, యెస్ బ్యాంక్ సహా 32 బ్యాంకులున్నాయి. ఇందులో ఏదో ఒక బ్యాంకు నుంచి పేటీఎం తీసుకోవాల్సి ఉంటుంది.
ప్రస్తుతం పేటీఎంలో 2కోట్లకుపైగా ఫాస్టాగ్ యూజర్లున్నారు. ఇవన్నీ మార్చి 15 తర్వాత పని చేసేవీలుండదు. వీరంతా తప్పనిసరిగా కొత్తగా ఫాస్టాగ్ తీసుకోవాలని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. కొత్తగా ఫాస్టాగ్‌ను తీసుకునేందుకు మొదట పేటీఎం ఫాస్టాగ్‌ను డీయాక్టివేట్ చేయాల్సి ఉంటుంది. దాన్ని డీయాక్టివేట్ చేయడంతో పాటు కొత్తగా తీసుకోవచ్చు ఓసారి తెలుసుకుందాం రండి..!
డీయాక్టివేషన్ ఇలా..
ఫాస్టాగ్ డీయాక్టివేషన్ చేసేందుకు మూడు అవకాశాలున్నాయి. ఇందులో ఒకటి 1800 120 4210 నంబర్‌కు కాల్ చేయాలి. ఎగ్జిస్టింగ్ అకౌంట్‌లకి మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత వెహికిల్ రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అనంతరం పేటీఎం కస్టమర్ సపోర్ట్ ఏజెంట్ అందుబాటులో ఉంటారు. పేటీఎం ఫాస్టాగ్ డీయాక్టివేషన్ ప్రక్రియను ఎలా చేసుకోవాలని ఏజెంట్స్ వివరిస్తారు.
రెండో విధానంలో ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చు. మీ స్మార్ట్‌ఫోన్‌లో పేటీఎం యాప్‌ని ఓపెన్ చేసి, ప్రొఫైల్ ఐకాన్‌పై క్లిక్ చేయాలి. హెల్ప్ అండ్ సపర్ట్ సెక్షన్ మీద క్లిక్ చేసొ బ్యాంకింగ్ సర్వీసెస్ అండ్ పేమెంట్స్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఇందులో ఫాస్టాగ్ సెక్షన్ ఉంటుంది. పేటీఎం ఎగ్జిక్యూటివ్‌తో మాట్లాడేందుకు ‘ఛాట్ విత్ అజ్’ ఆప్షన్ క్లిక్ చేయాలి. అయితే, రెస్పాన్స్ వచ్చిన తర్వాత పేటీఎం ఫాస్టాగ్ అకౌంట్‌ను డీయాక్టివేట్ చేసుకునే అవకాశం ఉంటుంది.
మూడో విధానంలో ఫాస్టాగ్ పేటీఎం పోర్ట్‌లోకి లాగిన్ అవ్వాలి. యూజర్ ఐడీ, వాలెట్ ఐడీ, పాస్వర్డ్ ద్వారా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఫాస్టాగ్ నెంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఇలా అన్ని వివరాలు ఇచ్చి వెరిఫికేషన్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. అనంతరం హెల్ప్ అండ్ సపోర్ట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ‘నాన్ ఆర్డర్ రిలేటెడ్ క్వేరీస్’ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అక్కడ ‘క్వేరీస్ రిలేటెడ్ టు అప్డేటింగ్ ఫాస్టాగ్ ప్రొఫైల్’ మీద క్లిక్ చేసి.. అక్కడ కనిపించే ‘ఐ వాంట్ టు క్లోజ్ మై ఫాస్టాగ్’ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేసి.. ఆ తర్వాత స్టెప్స్‌ని ఫాలో అవ్వాలి.
కొత్త ఫాస్టాగ్ తీసుకోవాలంటే..?
కొత్తగా ఫాస్టాగ్ తీసుకోవాలనుకున్న వారు మొదట పాతదాన్ని డియాక్టివేట్ చేయాల్సిందే. లేకపోతే కొత్తగా ఏ బ్యాంక్ ఫాస్టాగ్ జారీ చేయదు. డీయాక్టివేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత గూగుల్ స్టోర్‌లో కనిపించే మై ఫాస్టాగ్ యాప్‌ని డౌన్లోడ్ చేసుకోవాలి. అందులో ఈ-కామర్స్ లింక్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. న్యూ ఫాస్టాగ్‌ని కొనుగోలు చేసే ఆప్షన్ కనిపిస్తుంది. యాప్‌లో కనిపించే ‘యాక్టివేట్ ఫాస్టాగ్’ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ని ఎంచుకోవాలి.
అనంతరం.. ఫాస్టాగ్ ఐడీ, వెహికిల్ వివరాలు ఇవ్వాలి. కొత్త ఫాస్టాగ్ తీసుకునేందుకు . అథారైజ్డ్ బ్యాంకులోనైనా సంప్రదించి తీసుకోవచ్చు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లో అవకతవకల నేపథ్యంలో ఆర్‌బీఐ ఆంక్షలు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అధికృత బ్యాంకుల లిస్ట్ నుంచి తొలగించింది. మార్చి 15 వరకు ఫాస్టాగ్‌ని వాడుకోవచ్చు కానీ.. రీచార్జ్ చేసుకునే అవకాశం ఉండదు.