WhatsApp | వాట్సాప్‌ డేటా డిలీట్‌ అయ్యిందా..? ఈ సింపుల్‌ స్టెప్స్‌తో తిరిగి పొందొచ్చు..!

WhatsApp | వాట్సాప్‌ డేటా డిలీట్‌ అయ్యిందా..? ఈ సింపుల్‌ స్టెప్స్‌తో తిరిగి పొందొచ్చు..!

WhatsApp | ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగిస్తున్న మెసేజింగ్‌ ప్లాట్‌ఫామ్‌ వాట్సాప్‌. చాటింగ్‌, ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్స్‌ను సైతం షేర్‌ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. వాట్సాప్‌ యూజర్లలో గ్రూప్స్‌ సైతం ఉంటాయి. అయితే, కొన్నిసార్లు పొరపాటు చాట్స్‌ను డిలీట్‌ చేస్తుంటారు. ఆ తర్వాత తిరిగి పొందలేక ఇబ్బందులుపడుతుంటారు. డిలిట్‌ చేసి డేటాను తిరిగి ఎలా పొందడం అని ఆలోచిస్తుంటారు. డిలీట్ చేసిన వాట్సాప్‌ చాట్స్‌ను సింపుల్‌ స్టెప్స్‌లో డేటాను చాట్‌ను తిరిగి పొందేందుకు అవకాశం ఉంది. తిరిగి ఎలా పొందడమో చూసేద్దాం రండి..!

రికవరీ చేయడం ఎలా..?

చాట్స్‌ను డిలీట్‌ చేయడానికి ముందు యూజర్లు తప్పనిసరిగా వాట్సాప్‌ బ్యాకప్‌ను ఎనేబుల్‌ చేయాలి. బ్యాకప్‌ ఎనేబుల్‌ చేసి ఉంటేనే.. తిరిగి పొందడం వీలవుతుంది. బ్యాకప్ చేసిన వాట్సాప్ డేటాను వాట్సాప్ యాప్స్‌కు ఇంపోర్ట్ చేస్తే వెంటనే డిలీట్‌ అయిన వాట్సాప్‌ చాట్స్‌ అన్నీ రికవరీ అవుతాయి. దాంతో గూగుల్ డ్రైవ్ నుంచి వాట్సాప్ చాట్స్‌ను రికవరీ చేసుకునేందుకు అవకాశం టుంది. డేటాతో సహా అన్ని ఫైళ్లను ఏ డివైజ్ నుంచైనా బ్యాకప్ చేయడానికి, యాక్సెస్ చేయడానికి ఇది సులభమైన, సురక్షితమైన మార్గం. గూగుల్ డ్రైవ్‌తో వాట్సాప్ సందేశాలను బ్యాకప్ చేసేందుకు ఈ స్టెప్స్‌ ఫాలో అవ్వండి.

బ్యాకప్ ఎలా చేయాలంటే..?

మొదట వాట్సాప్‌ యాప్‌ను ఓపెన్‌ చేసి ‘మోర్‌ ఆప్షన్స్‌’పై క్లిక్‌ చేయాలి. ఆ తర్వాత సెట్టింగ్స్‌లోకి వెళ్లి ‘చాట్స్‌’ను ఎంపిక చేసుకోవాలి. అందులో ‘చాట్‌బ్యాకప్‌’ను సెలెక్ట్‌ చేసుకోవాలి. అందులో బ్యాకప్‌ టూ గూగుల్‌ డ్రైవ్‌’పై ప్రెస్‌ చేయాలి. ఆ తర్వాత ఫోన్‌ బ్యాకప్ ఫ్రీక్వెన్సీని సెటప్ చేసేందుకు కొత్త పేజీకి రీ డైరెక్ట్ అవుతుంది. ఇక్కడ ఫ్రీక్వెన్సీని సెట్ చేసి, మీ బ్యాకప్ చాట్ హిస్టరీని స్టోర్ చేయాలనుకుంటున్న గూగుల్ అకౌంట్‌ వివరాలు ఇవ్వాలి. మీ డివైజ్‌కు కనెక్ట్‌ చేసిన జీమెయిల్‌ అకౌంట్‌ లేకపోతే యాడ్‌ అకౌంట్‌పై క్లిక్‌ చేసి.. లాగిన్ వివరాలను ఇవ్వాలి. ఆ తర్వాత ‘బ్యాకప్ ఓవర్’ సెలక్ట్‌ చేసుకోవాలి. మీ బ్యాకప్‌ కోసం ఉపయోగించాలనుకుంటున్న ‘నెట్వర్క్’ని సెలెక్ట్‌ చేయాలి. ఇక వాట్సాప్ చాట్ బ్యాకప్ అవుతుంది. ఆ తర్వాత డిలీట్‌ అయిన డేటాను తిరిగి పొందేందుకు అవకాశం ఉంటుంది.