Hrithik Roshan | నీతా అంబానీ కల్చరల్‌ సెంటర్‌ ప్రారంభోత్సవంలో.. ప్రియురాలి చెప్పులు మోసిన హృతిక్‌ రోషన్‌..! ఫొటోలు వైరల్‌..!

Hrithik Roshan | ఇటీవల నీతాముకేశ్ అంబానీ కల్చరల్‌ సెంటర్‌ (NMACC) ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. కార్యక్రమానికి సినీ, రాజకీయ, క్రీడా, పారిశ్రామికవేత్తలు సందడి చేశారు. పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు తమ కుటుంబంతో హాజరయ్యారు. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు హృతిక్‌ రోషన్‌ సైతం తన ప్రియురాలు సబా ఆజాద్‌తో కార్యక్రమానికి హాజరయ్యాడు. హృతిక్‌ తన భార్య సుసానే ఖాన్‌కు 2014 విడాకులు ఇచ్చాడు. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్న హృతిక్‌ రోషన్‌.. బాలీవుడ్‌ నటి, సింగర్‌ సబా […]

Hrithik Roshan | నీతా అంబానీ కల్చరల్‌ సెంటర్‌ ప్రారంభోత్సవంలో.. ప్రియురాలి చెప్పులు మోసిన హృతిక్‌ రోషన్‌..! ఫొటోలు వైరల్‌..!

Hrithik Roshan |

ఇటీవల నీతాముకేశ్ అంబానీ కల్చరల్‌ సెంటర్‌ (NMACC) ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. కార్యక్రమానికి సినీ, రాజకీయ, క్రీడా, పారిశ్రామికవేత్తలు సందడి చేశారు. పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు తమ కుటుంబంతో హాజరయ్యారు. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు హృతిక్‌ రోషన్‌ సైతం తన ప్రియురాలు సబా ఆజాద్‌తో కార్యక్రమానికి హాజరయ్యాడు.

హృతిక్‌ తన భార్య సుసానే ఖాన్‌కు 2014 విడాకులు ఇచ్చాడు. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్న హృతిక్‌ రోషన్‌.. బాలీవుడ్‌ నటి, సింగర్‌ సబా ఆజాద్‌తో ప్రేమలో మునిగి తేలుతున్నాడు. ఎక్కడికి వెళ్లినా ఇద్దరు జంటగానే వాలిపోతున్నారు. పార్టీలకు, వేడుకలకు చెట్టాపట్టాలేసుకొని వెళ్తున్నారు.

ఇద్దరు అధికారికంగా ధ్రువీకరించకపోయినా ఇద్దరు డేటింగ్‌లో ఉన్నట్లు బాలీవుడ్‌లో ప్రచారం జరుగుతున్నది. తాజాగా హృతిక్ చేసిన సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్‌ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఇద్దరు.. వేరే సెలబ్రిటీలతో కలిసి ఫొటోలు దిగుతున్న సమయంలో సబా చెప్పులు తీసివేయగా.. వాటిని హృతిక్‌ చేతపట్టుకొని వేరే అతిథులతో మాట్లాడడంతో పాటు తిరగడం కనిపించింది.

దీంతో ‘పెద్ద పార్టీలో హృతిక్ ప్రియరాలి చెప్పులు మోశాడు’ అంటూ సోషల్‌ మీడియాలో ఫొటోలు వైరల్‌గా మారాయి. వీటిని చూసిన పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు. పార్టీలో చెప్పులు మోస్తున్నాడంటే.. అతనికి సబా అంటే ఎంత ఇష్టమో పలువురు యూజర్లు కామెంట్‌ చేయగా.. మరికొందరు హృతిక్‌తో చెప్పు మోయించిన సబాను తప్పుపట్టారు.