మెదక్: ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణకు భారీ ఏర్పాట్లు
ర్యాలీ బహిరంగ సభ.. పాల్గొనున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు విధాత, మెదక్ బ్యూరో: జిల్లా కేంద్రమైన మెదక్‌లో మంగళవారం 21న ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఛత్రపతి శివాజీ విగ్రహ కమిటీ అధ్యక్షులు మాయ శంకర్ విజ్ఞప్తి చేశారు. మెదక్ పట్టణంతో పాటు పరిసర గ్రామాలు చెందిన హిందూ బంధువులు పెద్ద ఎత్తున తరలి రావాలని, వ్యాపార, వాణిజ్య వర్గాలు సాయంత్రం సహకరించాలని కోరారు. విగ్రహావిష్కరణ అనంతరం సభ ఉంటుందన్నారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం బోధన్ […]

- ర్యాలీ బహిరంగ సభ..
- పాల్గొనున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు
విధాత, మెదక్ బ్యూరో: జిల్లా కేంద్రమైన మెదక్‌లో మంగళవారం 21న ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఛత్రపతి శివాజీ విగ్రహ కమిటీ అధ్యక్షులు మాయ శంకర్ విజ్ఞప్తి చేశారు. మెదక్ పట్టణంతో పాటు పరిసర గ్రామాలు చెందిన హిందూ బంధువులు పెద్ద ఎత్తున తరలి రావాలని, వ్యాపార, వాణిజ్య వర్గాలు సాయంత్రం సహకరించాలని కోరారు. విగ్రహావిష్కరణ అనంతరం సభ ఉంటుందన్నారు.
ఈ సందర్భంగా మధ్యాహ్నం బోధన్ చౌరస్తా నుండి భారీ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ర్యాలీలో మహారాష్ట్రకు చెందిన బ్యాండు ఆకర్షణగా ఉంటుందని, హనుమాన్ విగ్రహం ప్రదర్శనలో ఉంటుందన్నారు. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి గడ్డం శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు నాయిని ప్రసాద్, కోశాధికారి కామేశ్వరరావు, కార్యదర్శి చిన్న రామచంద్రం నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కేంద్రం మెదక్ ప్రధాన కూడలిలో శివాజీ విగ్రహం ఏర్పాటు చేయగా ఈనెల 21న శ్రీ చిదానంద ఆశ్రమ భువనేశ్వరి పీఠాధిపతులు కమలానంద భారతి స్వామి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో గోషామహల్ ఎమ్మెల్యేలు రాజాసింగ్, పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరీ సుభాష్ రెడ్డి పాల్గొంటారు.
మెదక్ పట్టణం రాందాస్ చౌరస్తాలో 16 అడుగుల భారీ కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు. మెదక్ పట్టణానికే తలమనికంగా ఉండాలన్న ధ్యేయంతో భారీ కాంస్య విగ్రహం ఏర్పాటుకు యోచించారు. దాతల సహకారంతో భారీ విగ్రహ ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించారు. దాతలు ముందుకు రావడంతో 22 లక్షలు వెచ్చించి పూణేలో 16 అడుగుల భారీ కాంస్య విగ్రహం తయారు చేయించారు.