ఉద్ధవ్ ఠాక్రేకు షాక్.. ఏక్‌నాథ్ చెంతకు 3 వేల మంది
విధాత: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ప్రస్తుతం ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేకు రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. తాజాగా శివసేనకు చెందిన 3 వేల మంది కార్యకర్తలు షిండే పక్షాన చేరారు. ఇవాళ ముంబైలోని వోర్లీలో 3 వేల మంది కార్యకర్తలు షిండే వర్గానికి మద్దతు ప్రకటించారు. ఈ నిర్ణయం ఉద్ధవ్ ఠాక్రేకు షాక్‌నిచ్చింది. వోర్లి నియోజకవర్గం నుంచి ఆదిత్య ఠాక్రే ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. దీంతో ఠాక్రే కుటుంబానికి […]

విధాత: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ప్రస్తుతం ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేకు రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. తాజాగా శివసేనకు చెందిన 3 వేల మంది కార్యకర్తలు షిండే పక్షాన చేరారు.
ఇవాళ ముంబైలోని వోర్లీలో 3 వేల మంది కార్యకర్తలు షిండే వర్గానికి మద్దతు ప్రకటించారు. ఈ నిర్ణయం ఉద్ధవ్ ఠాక్రేకు షాక్‌నిచ్చింది. వోర్లి నియోజకవర్గం నుంచి ఆదిత్య ఠాక్రే ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. దీంతో ఠాక్రే కుటుంబానికి గట్టి ఎదురుదెబ్బ తగిలిందని చెప్పొచ్చు.
ఆదిత్య ఠాక్రే ప్రవర్తన తీరుకు విసుగుచెందిన తామంతా ఉద్దవ్ ఠాక్రే వర్గాన్ని వీడి ఏకనాథ్ షిండే వర్గంలో చేరాలని నిశ్చయించుకున్నట్లు ఒక శివసైనికుడు చెప్పారు. దసరా పండుగను పురస్కరించుకుని ఉద్దవ్ ఠాక్రే వర్గం ర్యాలీ నిర్వహించేందుకు ముంబై హై కోర్టు నుంచి అనుమతి కూడా పొందింది. ఇదే సమయంలో దాదాపు 3 వేల మంది శివసేన కార్యకర్తలు ఉద్దవ్ ఠాక్రే వర్గాన్ని వీడటం విశేషం.