USA: హరికేన్ విధ్వంసం.. ఫ్లోరిడా ఆగమాగం.. మారిన రూపురేఖలు
విధాత: అమెరికాలోని ఫ్లోరిడాను ఇయాన్ హరికేన్ పెను విధ్వంసం సృష్టించింది. అమెరికా చరిత్రలో అత్యంత శక్తిమంతమైన తుఫాన్ ధాటికి ఫ్లోరిడా రాష్ట్రం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఈ వరదలకు నలుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. గల్లంతైన వారికి కోసం గాలింపు చర్యలు కొన సాగిస్తున్నట్లు చెప్పారు. మౌలిక సదుపాయలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇయాన్ తుఫాన్‌తో విద్యుత్ వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. దాదాపు 27 లక్షల కుటుంబాలు అంధకారంలోనే మగ్గుతున్నాయని అధికారులు తెలిపారు. అందమైన సముద్ర […]

విధాత: అమెరికాలోని ఫ్లోరిడాను ఇయాన్ హరికేన్ పెను విధ్వంసం సృష్టించింది. అమెరికా చరిత్రలో అత్యంత శక్తిమంతమైన తుఫాన్ ధాటికి ఫ్లోరిడా రాష్ట్రం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఈ వరదలకు నలుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
గల్లంతైన వారికి కోసం గాలింపు చర్యలు కొన సాగిస్తున్నట్లు చెప్పారు. మౌలిక సదుపాయలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇయాన్ తుఫాన్‌తో విద్యుత్ వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. దాదాపు 27 లక్షల కుటుంబాలు అంధకారంలోనే మగ్గుతున్నాయని అధికారులు తెలిపారు.
అందమైన సముద్ర తీరాలు, ఉద్యానవనాలకు పేరు గాంచిన ఫ్లోరిడా నగరం ప్రస్తుతం అస్తవ్యస్తంగా మారిపోయింది. ఉధృతంగా వీచిన గాలులు, ఎగిపిసడిన అలలు, భారీ వర్షాలు తీర ప్రాంతాలను దెబ్బతీశాయి.
సముద్రంలో ఉండాల్సిన షార్కులు, మొసళ్లు నగరంలో ఈదుతూ కనిపించాయి. దీనిని బట్టి ఈ తుఫాను బీభత్సం ఏస్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. ఇయన్ హరికేన్ ఫ్లోరిడా తీరాన్ని బలంగా తాకింది. 209 కిలో మీటర్ల వేగంతో వీచిన గాలులకు టంపా బే తీరం అల్లకల్లోలంగా మారింది.
వృక్షాలు, విద్యుత్ స్తంబాలు కూలిపోయాయి. సముద్ర కెరటాలు 18 అడుగుల ఎత్తున ఎగిసిపడుతూ తీరాన్ని బలంగా తాకాయి. ఈ ధాటికి ఓడరేవులో నిలిపి ఉన్న బోట్లు తిరగబడ్డాయి.
ఈ దెబ్బకు సముద్రంలో వలసదారులు ప్రయాణిస్తున్న బోటు మునిగిపోయింది. వీరిలో కొందరిని బోర్డర్ పెట్రోలింగ్ సిబ్బంది రక్షించారు. దాదాపు 23 మంది గల్లంతైపోయారు. నార్త్ పెరీ విమానాశ్రయంతో పాటు డెల్రే బీచ్ సమీపంలో పల్టీలు కొట్టిన విమానాలు కనిపించాయి భారీ వర్షాలు కురవడంతో సముద్రం, తీర ప్రాంత జనావాసాలు కలిసిపోయినట్లుగా కనిపించాయి.
ఈ హరికేన్ సృష్టించిన విధ్వంసంతో టాంపా, ఒర్లాండో విమానాశ్రయాల్లో విమానాల రాకపోకల్ని నిలిపివేశారు. విద్యుత్ లేకపోవడం, సెల్ టవర్లు పనిచెయ్యకపోవడంతో సహాయ చర్యలు అందించడం కత్తి మీద సాములా మారిందని అధికారులు చెబుతున్నారు. హరికేన్ విధ్వంసం సృష్టించే ప్రాంతాల్ని తిరిగి పునర్నిర్మిస్తామని అధ్యక్షుడు జో బైడెన్ హామీ ఇచ్చారు.