Hyderabad | ప్రభుత్వ అధికారుల పనితీరు తెలిపే బాక్స్.. ప్రారంభించిన మాజీ JD లక్ష్మినారాయణ, RP పట్నాయక్
Hyderabad | ప్రభుత్వ అధికారులకు ఆఫర్ చేద్దాం.. ఏ శాఖ ముందుకు వస్తుందో చూద్దాం.. ఫిర్యాదుల బాక్స్‌ను ప్రారంభించిన మాజీ జెడి లక్ష్మినారాయణ, ఆర్పీ పట్నాయక్ హైదరాబాద్: యూత్ ఫర్ యాంటీ కరప్షన్ గత కొన్ని సంవత్సరాలుగా వినూత్న కార్యక్రమాలు చేస్తూ సమాజంలో ముందుకు పోతుందని, గతంలో నిజాయితీ పరులకు సన్మానం చేశారని, ఇప్పుడు మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని సిబిఐ మాజీ జెడీ లక్ష్మినారాయణ అన్నారు. గురువారం యూత్ ఫర్ యాంటీకరప్షన్ కేంద్ర కార్యాలయంలో […]

Hyderabad |
- ప్రభుత్వ అధికారులకు ఆఫర్ చేద్దాం..
- ఏ శాఖ ముందుకు వస్తుందో చూద్దాం..
- ఫిర్యాదుల బాక్స్‌ను ప్రారంభించిన మాజీ జెడి లక్ష్మినారాయణ, ఆర్పీ పట్నాయక్
హైదరాబాద్: యూత్ ఫర్ యాంటీ కరప్షన్ గత కొన్ని సంవత్సరాలుగా వినూత్న కార్యక్రమాలు చేస్తూ సమాజంలో ముందుకు పోతుందని, గతంలో నిజాయితీ పరులకు సన్మానం చేశారని, ఇప్పుడు మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని సిబిఐ మాజీ జెడీ లక్ష్మినారాయణ అన్నారు.
గురువారం యూత్ ఫర్ యాంటీకరప్షన్ కేంద్ర కార్యాలయంలో ప్రభుత్వ కార్యాలయాలలో ఏర్పాటు చేసే ఫిర్యాదుల బాక్స్‌ను ప్రముఖ సంగీత దర్శకులు ఆర్పీ పట్నాయక్, సంస్థ పౌండర్ రాజేంద్ర పల్నాటితో ప్రారంభించారు. ముందుగా కొన్ని ప్రభుత్వ శాఖలను మీ కార్యాలయాలలో ఫిర్యాదుల బాక్స్‌ను ఏర్పాటు చేస్తామని అడగండి. వారేం సమాధానం చెపుతారో చూడండి అన్నారు.
ఫిర్యాదులే కాకుండా ఒక ప్రభుత్వ కార్యాలయానికి వెళితే అధికారుల పనితీరు ఏలా ఉంది, అక్కడ పరిసరాలు ఏలా ఉన్నాయో కూడా వేయాలన్నారు. ప్రభుత్వం అంటే ప్రజలకు ఉపయోగపడాలి, ఎన్నో పథకాలు తెస్తున్నారు, అవన్నీ ప్రజలకు అందుతున్నాయా లేదా తెలుస్తోంది.
ప్రభుత్వ కార్యాలయాలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఎవరికి ఫిర్యాదు చేయాలో, ఏలా ఫిర్యాదు చేయాలో తెలియదని, మనం చేసే ఫిర్యాదుల బాక్స్‌ల వలన ప్రభుత్వ కార్యాలయాలు చేసే మంచి, చెడు పనులు బయటపడుతాయన్నారు. దాంతో పాటు ప్రభుత్వ కార్యాలయాలలోని అధికారుల వెనకాల నేను అవినీతికి పాల్పడను, నేను నిజాయితీగా ఉంటానని స్టిక్కర్ కూడా వేయాలని, దీని వలన అధికారుల్లో కొంచెం మార్పు వస్తుందన్నారు.
ఫిర్యాదుల బాక్సులలో వచ్చే ఫిర్యాదులు వారానికి ఒకసారి తీసి అందులో వచ్చే సమస్యలు, ఫిర్యాదులు, అధికారుల మంచితనాన్ని బహిర్గతం చేయాలన్నారు. సంబంధింత అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఏ అధికారిపై ఏలాంటి ఫిర్యాదులు వచ్చాయి, ఏ ప్రభుత్వ శాఖ పనితీరు ఏలా ఉందో తెలిసే అవకాశం ఉంటుందన్నారు.
కొంతమంది అవినీతి అధికారులు మనం ఫిర్యాదులు బాక్స్‌లు ఏర్పాటు చేయగానే వెంటనే తొలగించే అవకాశం ఉంటుందని, వాటిపై ఆ ప్రభుత్వ కార్యాలయంపైనే ఫిర్యాదు చేయాలన్నారు. అవినీతి లేని మంచి పరిపాలన, జవాబుదారీతనంతో పనిచేసే అధికారుల సంఖ్య పెంచే బాధ్యతను యూత్ ఫర్ యాంటీ కరప్షన్ తీసుకొవాలన్నారు.
ప్రముఖ సంగీత దర్శకులు ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ లంచగొండి అధికారి అవినీతిపై ఎవరికైనా ఫిర్యాదు చేస్తే బెదిరింపులు వస్తున్నాయని, అందుకే అవినీతి జరిగినా, అన్యాయం జరిగినా ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియదన్నారు. అవినీతిని తగ్గిస్తే 30లక్షలకు అయ్యే పని 10లక్షలకు పూర్తవుతుందన్నారు. ఇప్పుడు ప్రభుత్వ అధికారుల అవినీతిపై పరిష్కారం కాని సమస్యలపై ఈ ఫిర్యాదుల బాక్స్‌లో ధైర్యంగా, పేరు రాయకుండా ఫిర్యాదు చేయాలన్నారు. అవినీతి రహిత సమాజం కోసం ఫిర్యాదుల బాక్స్ ఒక మంచి మార్గమన్నారు.
ఈ కార్యక్రమంలో యూత్ ఫర్ యాంటీ కరప్షన్ పౌండర్ రాజేంద్ర పల్నాటి, సలహదారులు డా. ప్రతిభాలక్ష్మి, డా. స్రవంతి, సారా, మీడియా కార్యదర్శి జయరాం. కార్యదర్శులు కానుగంటి రాజు, కొన్నె దేవేందర్, ఇందిరా ప్రియదర్శిని, స్నిగ్ధ, మారియా అంతోని, జి. హరిప్రకాశ్, కొమటి రమేష్‌బాబు, మూడావత్ రమేష్‌బాబు, అంజుకర్, గంగాధర్, సత్తార్, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.