హైద‌రాబాద్‌లో పాక్ ఆట‌గాళ్ల‌కి విందు.. ఫుడ్ మెనూ చూస్తే ఆంతే !

  • By: sn    latest    Sep 28, 2023 1:51 PM IST
హైద‌రాబాద్‌లో పాక్ ఆట‌గాళ్ల‌కి విందు.. ఫుడ్ మెనూ చూస్తే ఆంతే !

వన్డే ప్రపంచకప్ కోసం దాదాపు ఏడేళ్ల తర్వాత పాకిస్థాన్‌ జట్టు భారత గడ్డపై అడుగుపెట్టిన విష‌యం తెలిసిందే. అనేక ప‌రిస్థితుల నడుమ బుధవారం రాత్రి 10 గంటలకు హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానశ్రయానికి చేరుకున్న పాకిస్థాన్ జట్టుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఘన స్వాగతం పలికింది. ఇక పాకిస్తాన్ ఆట‌గాళ్ల‌ని చూసేందుకు న‌గ‌ర అభిమానులు కూడా భారీగానే త‌ర‌లి వ‌చ్చారు. వారికి ఘ‌న స్వాగ‌తం కూడా పలికారు. వారిని క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త మ‌ధ్య పార్క్ హ‌య‌త్ హోట‌ల్‌కి త‌ర‌లించారు. అయితే వారికి హైద‌రాబాద్ బిర్యానిని రుచి చూపించ‌డం విశేషం.