Swati Maliwal । నేనూ.. తండ్రి చేతిలో బాధితురాలినే: స్వాతి మలివాల్
విధాత: చిన్నతనంలో తన తండ్రి తనను లైంగికంగా వేధించాడని (Abused) ఇటీవలే జాతీయ మహిళా కమిషన్ (NCW) సభ్యురాలు ఖుష్బూ సుందర్ (Khushbu Sundar) సంచనలనాత్మకంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. తాను కూడా తండ్రి చేతిలో అలాంటి బాధలే పడ్డానని తాజాగా ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ (Swati Maliwal) వెల్లడించారు. చిన్నతనంలో తాను ఫోర్త్‌గ్రేడ్ చదివేటప్పడు అనేక సార్లు తనను లైంగికంగా వేధించాడని తెలిపారు. మంచం కింద దాక్కునే దాన్ని.. ‘ఆయన ఇంటికి […]

విధాత: చిన్నతనంలో తన తండ్రి తనను లైంగికంగా వేధించాడని (Abused) ఇటీవలే జాతీయ మహిళా కమిషన్ (NCW) సభ్యురాలు ఖుష్బూ సుందర్ (Khushbu Sundar) సంచనలనాత్మకంగా వెల్లడించిన సంగతి తెలిసిందే.
తాను కూడా తండ్రి చేతిలో అలాంటి బాధలే పడ్డానని తాజాగా ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ (Swati Maliwal) వెల్లడించారు. చిన్నతనంలో తాను ఫోర్త్‌గ్రేడ్ చదివేటప్పడు అనేక సార్లు తనను లైంగికంగా వేధించాడని తెలిపారు.
మంచం కింద దాక్కునే దాన్ని..
‘ఆయన ఇంటికి వచ్చాడంటే భయపడిపోయేదాన్ని. ఒక్కోసారి మంచం కింద దాక్కునేదాన్ని. ఎప్పడూ నన్ను కొడుతూ ఉండేవాడు. జడ పట్టుకుని తలను నేలకేసి బాదేవాడు. తల పగిలి నెత్తురు కూడా వచ్చేది’ అని ఆమె తన భయానక అనుభవాలను గుర్తు చేసుకున్నారు.
‘ఇలా చిన్నపిల్లల్ని వేధించేవారికి ఎలాంటి గుణపాఠాలు చెప్పాలి? బాధితులకు ఎలా సహాయం చేయాలి? అనే అంశంపై ప్రతి రాత్రి ఆలోచించేదానినని వెల్లడించారు. ఇటువంటి వేధింపులకు గురవుతున్న వారి బాధ.. అనుభవించిన వారికే అర్థమవుతుందని ఆమె అన్నారు.