బీజేపీకి ఓటు వేయ‌మ‌ని చెప్ప‌ను: మాజీ సీఎం ఉమాభార‌తి

ఉత్త‌ర భారతంలో బీజేపీకి గ‌డ్డుకాలమే అంటున్న రాజ‌కీయ విశ్లేష‌కులు విధాత‌: బీజేపీ సీనియ‌ర్ నేత, మ‌ధ్య‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి ఉమాభార‌తి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మ‌ధ్య ప్ర‌దేశ్‌లోని లోధి సామాజిక వ‌ర్గానికి చెందిన వారు త‌మ‌కు న‌చ్చిన వారికి, త‌మ ప్ర‌యోజ‌నాల‌కు అనుగుణంగా ఓటు వేసుకోవాల‌ని పిలుపునిచ్చారు. లోధి సామాజిక వ‌ర్గానికి చెందిన వారు ఏర్పాటుచేసిన ఓ కార్య‌క్ర‌మంలో ఉమాభార‌తి చేసిన వ్యాఖ్య‌లు ఉత్త‌ర‌భార‌తంలో తీవ్ర సంచ‌ల‌నం రేపుతున్నాయి. ఇదే సామాజిక వ‌ర్గానికి చెందిన ఉమాభార‌తి మాట‌లు […]

  • Publish Date - December 29, 2022 / 10:05 AM IST
  • ఉత్త‌ర భారతంలో బీజేపీకి గ‌డ్డుకాలమే అంటున్న రాజ‌కీయ విశ్లేష‌కులు

విధాత‌: బీజేపీ సీనియ‌ర్ నేత, మ‌ధ్య‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి ఉమాభార‌తి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మ‌ధ్య ప్ర‌దేశ్‌లోని లోధి సామాజిక వ‌ర్గానికి చెందిన వారు త‌మ‌కు న‌చ్చిన వారికి, త‌మ ప్ర‌యోజ‌నాల‌కు అనుగుణంగా ఓటు వేసుకోవాల‌ని పిలుపునిచ్చారు.

లోధి సామాజిక వ‌ర్గానికి చెందిన వారు ఏర్పాటుచేసిన ఓ కార్య‌క్ర‌మంలో ఉమాభార‌తి చేసిన వ్యాఖ్య‌లు ఉత్త‌ర‌భార‌తంలో తీవ్ర సంచ‌ల‌నం రేపుతున్నాయి. ఇదే సామాజిక వ‌ర్గానికి చెందిన ఉమాభార‌తి మాట‌లు ఆ రాష్ట్రంలో తీవ్ర ప్ర‌భావం చూపుతాయ‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు అంటున్నారు.

అట‌ల్‌బిహారీ హ‌యాంలో ఉమాభార‌తి బీజేపీకి పెద్ద వ‌న‌రు, ఫైర్ బ్రాండ్‌గా పేరుగాంచారు. దేశ వ్యాప్తంగా బీజేపీకి బ‌ల‌మైన పునాదులు వేయ‌టంలో ఉమాభార‌తి తీవ్రంగా కృషిచేశారు. రామ‌జ‌న్మ‌భూమి వివాదంలో ఆయోధ్య విముక్తి ఉద్య‌మానికి కేంద్ర బిందువుగా ప‌నిచేసిన ఉమాభార‌తి బాబ్రీ మ‌సీదును కూల్చివేసిన కేసులో త‌న‌ను అరెస్టు చేసి జైలు శిక్ష వేసినా ఆహ్వానిస్తాన‌ని ప్ర‌క‌టించారు.

వాజ‌పేయి హ‌యాంలో ఉత్త‌ర భార‌తంలోనే కాదు, దేశ వ్యాప్తంగా పార్టీకి ఆక‌ర్ష‌ణ‌ శ‌క్తిగా నిలిచారు ఉమా. ఆ నేప‌థ్యంలోంచే… ఉమాభార‌తి 2013లో మ‌ధ్య‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో స్టార్ క్యాంపేయిన‌ర్ గా వ్య‌వ‌హ‌రించారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్ 230 అసెంబ్లీ స్థానాల్లో 173 గెలిపించి త‌న విశిష్ఠ‌త‌ను చాటుకొన్నారు.

ఆ క్ర‌మంలోనే ఆమె మ‌ధ్యప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. ఆ త‌ర్వాత కాలంలో కూడా ఆమె కేంద్ర మంత్రివ‌ర్గంలో అనేక కీల‌క ప‌ద‌వుల‌ను నిర్వ‌హించారు.

మోదీ ప్రాబ‌ల్యం పెరిగిన త‌ర్వాత తెరమ‌రుగైన అనేక మంది సీనియ‌ర్ బీజేపీ నేతల్లో ఉమాభార‌తి కూడా ఒక‌రు. ఇప్పుడామె తాను బీజేపీకి ఓటు వేయ‌మ‌ని చెప్ప‌బోన‌ని ప్ర‌క‌టించ‌టం స‌ర్వ‌త్రా చ‌ర్చానీయాంశం అవుత‌న్న‌ది. అలాగే… ఈ ప‌రిణామం బీజేపీకి పెద్ద దెబ్బేన‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెప్తుండ‌టం గ‌మ‌నార్హం.