చైతును ప్రేమిస్తున్నా: దివ్యాంశ!.. మ‌రి చైతుకీ?

విధాత‌: అందం, అభినయం, దానికి తగ్గ గ్లామర్ లుక్స్‌తో మెప్పించే నటి దివ్యాంశ కౌశిక్. నాగచైతన్య సరసన మ‌జిలి చిత్రంలో నటించి యువకుల మనసులు దోచింది. టీనేజ్ గర్ల్‌గా మంత్రముగ్ధులను చేసింది. తన అందం, నటనతో ఆకట్టుకుంది. రవితేజ సరసన రామారావు ఆన్ డ్యూటీ సినిమాలోనూ నటించింది. కానీ ఈ చిత్రం సరిగా ఆడలేదు. అయినా ఆమె కెరీర్‌కు ఎలాంటి డోకా లేకుండా నుడుస్తోంది. పలు తెలుగు చిత్రాల కమిట్మెంట్‌తో బిజీగా ఉంది. సందీప్ కిషన్, విజయ్ […]

చైతును ప్రేమిస్తున్నా: దివ్యాంశ!.. మ‌రి చైతుకీ?

విధాత‌: అందం, అభినయం, దానికి తగ్గ గ్లామర్ లుక్స్‌తో మెప్పించే నటి దివ్యాంశ కౌశిక్. నాగచైతన్య సరసన మ‌జిలి చిత్రంలో నటించి యువకుల మనసులు దోచింది. టీనేజ్ గర్ల్‌గా మంత్రముగ్ధులను చేసింది. తన అందం, నటనతో ఆకట్టుకుంది. రవితేజ సరసన రామారావు ఆన్ డ్యూటీ సినిమాలోనూ నటించింది. కానీ ఈ చిత్రం సరిగా ఆడలేదు.

అయినా ఆమె కెరీర్‌కు ఎలాంటి డోకా లేకుండా నుడుస్తోంది. పలు తెలుగు చిత్రాల కమిట్మెంట్‌తో బిజీగా ఉంది. సందీప్ కిషన్, విజయ్ సేతుపతి నటిస్తున్న మైఖేల్ పాన్ ఇండియా చిత్రంలో నటిస్తోంది. సుదీర్ వర్మ తదుపరి చిత్రంలో ఈమె హీరోయిన్ అని కథనాలు వచ్చాయి. హిందీలోనూ ది వైఫ్ అనే చిత్రంలో దివ్యాంశ నటించింది.

మజిలీ చిత్రం సమయంలో దివ్యాంశాతో ప్రేమాయణం సాగించడం వల్లనే సమంతతో నాగచైతన్య బ్రేకప్ అయ్యిందంటూ ఒక ప్రచారం సాగింది. బ్రేకప్ తర్వాత తనిని నాగచైతన్య పెళ్లి చేసుకోనున్నాడ‌ని కొన్ని మీడియాలో కథనాలు సైతం వచ్చాయి. అయితే తాజాగా దీనిపై ఆమె స్పందిస్తూ అవన్నీ రూమర్లు మాత్రమేనని, ఐ లవ్ నాగచైతన్య. అతను చాలా అందగాడు. తనపై క్ర‌ష్ అయితే ఉందని తన మనసులోని మాటను బయటపెట్టింది.

అయితే అతన్ని ఒక సీనియర్ నటుడిగా గౌరవిస్తాను. చైతన్యతో పెళ్లి పుకార్ల‌ను నేను వినలేదు. ఎవరి పనిలో వారు బిజీగా ఉన్నామని దివ్యాంశ కౌశిక్ తెలిపింది. మొత్తానికి నాగచైతన్య అంటే దివ్యాంశకు క్రష్ ఉంది. మరి చైతుకు దివ్యాంశ అంటే క్రష్ ఉందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

ఇక సమంతతో విడిపోయిన తర్వాత నాగచైతన్యకు దివ్యంశ కౌశిక్‌తో పాటు శోభితా ధూళిపాళ్ల‌తో కూడా ఎఫైర్ ఉంద‌ని, వారిద్ద‌రూ వివాహం చేసుకోనున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. కానీ అవన్నీ పుకార్లేనని తేలిపోయాయి.