Manchu Manoj’s Satires: శివయ్యా అని పిలిస్తే శివుడు రాడు: మంచు మనోజ్ సైటైర్లు

Manchu Manoj’s Satires: శివయ్యా అని పిలిస్తే శివుడు రాడు: మంచు మనోజ్ సైటైర్లు

శివయ్యా అని పిలిస్తే శివుడు రాడు: మంచు మనోజ్ సైటైర్లు
Manchu Manoj’s Satires: శివయ్యా అని పిలిస్తే శివుడు రాడని..మనసారా ప్రేమతో పిలిస్తే నిర్మాత, దర్శకుడు..అభిమానుల రూపంలో శివుడు వస్తాడని హీరో మంచు మనోజ్ తన అన్న మంచు విష్ణుపై కన్నప్ప సినిమాలోని డైలాగ్ లతో పరోక్షంగా సెటైర్లు వేశాడు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్‌తో పాటు తాను నటించిన ‘భైరవం’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ ఏలురూలో జరిగింది. ఈవెంట్ లో పాల్గొన్న మంచు మనోజ్ తండ్రి మోహన్ బాబు కుటుంబంతో నెలకొన్న వివాదం నేపథ్యంలో భావోద్వేగంతో మాట్లాడారు. సినిమా తప్ప తనకు ఏమీ తెలియదంటూ ఎమోషనల్ అయిన మనోజ్ కన్నీరు పెట్టుకున్నారు. సొంత వాళ్లే దూరం పెడుతున్న ఈ రోజుల్లో తనపై అభిమానులు ఎంతో ప్రేమ కురిపిస్తున్నారంటూ ఎమోషనల్ అయ్యారు. ఈ గుండె ఇంత ధైర్యంగా ఉండందంటూ అభిమానులే కారణమన్నారు. నా భార్య పిల్లలు నీ కుటుంబం ఏదంటే ఇదితో ఈ అభిమాన జనమే మన కుటుంబం అని చూపించే ధైర్య ఇచ్చారన్నారు. ఈవెంట్ లో మంచు మనోజ్ సినిమా జర్నీతో కూడిన ఏవీ వీడియోను ప్రదర్శించారు అది చూసిన మంచు మనోజ్ ఎమోషనల్ అయ్యారు. ఆరేళ్త తర్వాతా మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నానన్నారు.

కొంతకాలంగా తన జీవితంలో ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయని..కేసులు, దాడులు జరిగాయని..కట్టుబట్టలతో, వస్తువులతో, పిల్లలతో తనను రోడ్డుపై నిలబెట్టారని, ఆ సమయంలో అభిమానులే తనకు అండగా నిలబడ్డారని కంటతడి పెట్టకున్నారు. ఎవరు లేరని బాధపడుతున్న తరుణంలో నిమిషాల్లో ఇంటిముందు 30కార్లతో అభిమానులు శివయ్య రూపంలో మేమున్నామంటు వచ్చారని గుర్తు చేసుకున్నారు. అయినా కట్టె కాలే వరకు తాను మోహన్ బాబు అబ్బాయినేనని.. తండ్రి నేర్పించిన క్రమశిక్షణతోనే ముందుకు సాగుతానని వ్యాఖ్యానించారు. నాపై ఎన్నో కేసులు పెట్టారని, బాధ పెట్టారని..అయినా వారిపై కోపం లేదని..బాధ ఉందన్నారు. అది నా బలహీనతో వారి బలమో అర్ధం కావడం లేదన్నారు.  ఈవెంట్ పూర్తయ్యాక హీరో నారా రోహిత్ సైతం మంచు మనోజ్ భావోద్వేగం ప్రసంగం శక్తివంతమైందన్నారు. ఏదీ ఏమైనా నేను ఎల్లప్పుడు మీ తోడు ఉంటాను..ఐ లవ్ యూ బాబాయ్ అంటూ ఎక్స్ లో పోస్టు చేశారు.