ఒక్కసారి ఓటేస్తే.. ఐదేండ్లు మీ పాలేరును: డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్

ఆశీస్సులతో ఆరు సార్లు ఎమ్మెల్యేనయ్యా బండి బాష మార్చుకోవాలే దయనీయ స్థితిలో కాంగ్రెస్ డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్ విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: మీరు ఐదుసంవత్సరాలకు ఒక్కసారి ఓటువేస్తే.. ఐదేళ్ళు పాలేరులాగా 24గంటలు అందుబాటులో ఉండి సేవచేస్తున్నానని డోర్నకల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డిఎస్ రెడ్యానాయక్ తన జీవితానుభవాన్ని వివరించారు. డోర్నకల్ నియోజకవర్గం నా..దేవాలయం, మీరంతా నా..దేవుళ్ళు. నేను మీ..అందరి సేవకున్ని అంటూ రెడ్యానాయక్ ప్రకటించారు. మీ..ఆశీస్సులతో ఆరుసార్లు ఎమ్మెల్యేనయ్యా మా..అమ్మా నాన్న చదువురాని వాళ్ళు. […]

  • By: krs    latest    Apr 07, 2023 2:05 PM IST
ఒక్కసారి ఓటేస్తే.. ఐదేండ్లు మీ పాలేరును: డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్
  • ఆశీస్సులతో ఆరు సార్లు ఎమ్మెల్యేనయ్యా
  • బండి బాష మార్చుకోవాలే
  • దయనీయ స్థితిలో కాంగ్రెస్
  • డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: మీరు ఐదుసంవత్సరాలకు ఒక్కసారి ఓటువేస్తే.. ఐదేళ్ళు పాలేరులాగా 24గంటలు అందుబాటులో ఉండి సేవచేస్తున్నానని డోర్నకల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డిఎస్ రెడ్యానాయక్ తన జీవితానుభవాన్ని వివరించారు. డోర్నకల్ నియోజకవర్గం నా..దేవాలయం, మీరంతా నా..దేవుళ్ళు. నేను మీ..అందరి సేవకున్ని అంటూ రెడ్యానాయక్ ప్రకటించారు.

మీ..ఆశీస్సులతో ఆరుసార్లు ఎమ్మెల్యేనయ్యా

మా..అమ్మా నాన్న చదువురాని వాళ్ళు. గుడిసెలో ఉండేవాళ్ళు. జొన్నరొట్టే..సజ్జగటక తిని పెరిగాం. అలాంటి నేను మీ..ఆశీస్సులతో, అభిమానంతో ఎమ్మెల్యేగా ఆరుసార్లు విజయం సాధించానంటూ ఎమ్మెల్యే అన్నారు.

నియోజకవర్గంలోని సిరోలు మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన టిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ప్రజలతో తనకున్న అనుబంధాన్ని, తన అనుభవాలను వివరించారు. కాసింత ఉద్వేగానికి లోనయ్యారు.

బీజేపీ, కాంగ్రెస్‌పై విమర్శలు

బండి సంజయ్ బాష మార్చుకోవాలే.. ఆయన మాట్లాడుతున్నాడో.. కారుకూతలు కూస్తున్నాడో తెలియదని రెడ్యానాయక్ ఆవేదన వ్యక్తంచేశారు.

తమ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ యంపి సీటు తీసేసినా రోడ్డుమీదికి రాలేని దయనీయస్థితిలో కాంగ్రెస్ ఉందని విచారం వెలిబుచ్చారు.

మళ్ళీ కేసీఆర్ ను గెలిపించాలి. ముఖ్యమంత్రిగా చేయాలి. మీరు ఓటువేసి ఎమ్మెల్యేగా నన్ను గెలిపిస్తే నేను వెళ్ళి ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఓటువేస్తానని రెడ్యానాయక్ హామీ ఇచ్చారు.