‘ప్రజావాణి’ పిర్యాదులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి
అధికారులను ఆదేశించిన అదనపు కలెక్టర్ రమేష్ విధాత, మెదక్ బ్యూరో: ప్రజావాణిలో వస్తున్న ఫిర్యాదులకు ఎలాంటి కాలయాపన లేకుండా తక్షణమే స్పందించి పరిష్కరించవలసినదిగా అదనపు కలెక్టర్ రమేష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణిలో జిల్లా నలుమూలల నుండి వివిధ సమస్యల పరిష్కార నిమిత్తం వచ్చిన 80 వినతులను అదనపు కలెక్టర్ రమేష్, డి.ఎస్.ఓ. శ్రీనివాస్ లు తీసుకొని అట్టి వినతులపై తగు చర్యలు తీసుకోవలసిందిగా ఆయా శాఖల అధికారులకు సూచించారు. ఇందులో ధరణి,భూ సమస్యలకు సంబంధించి […]

అధికారులను ఆదేశించిన అదనపు కలెక్టర్ రమేష్
విధాత, మెదక్ బ్యూరో: ప్రజావాణిలో వస్తున్న ఫిర్యాదులకు ఎలాంటి కాలయాపన లేకుండా తక్షణమే స్పందించి పరిష్కరించవలసినదిగా అదనపు కలెక్టర్ రమేష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణిలో జిల్లా నలుమూలల నుండి వివిధ సమస్యల పరిష్కార నిమిత్తం వచ్చిన 80 వినతులను అదనపు కలెక్టర్ రమేష్, డి.ఎస్.ఓ. శ్రీనివాస్ లు తీసుకొని అట్టి వినతులపై తగు చర్యలు తీసుకోవలసిందిగా ఆయా శాఖల అధికారులకు సూచించారు.
ఇందులో ధరణి,భూ సమస్యలకు సంబంధించి 50 దరఖాస్తులు, పింఛనలకు సంబంధించి 4, పోడు భూములు 12, జిల్లా పంచాయతీ 4, మహిళా,వికలాంగుల సంక్షేమం 1, గ్రౌండ్ వాటర్ 1, ఇతర శాఖలకు సంబంధించి 8 వినతులు వచ్చాయి. వినతులు ఇలా..
కౌడిపల్లి మండలం రాయిలాపూర్ గ్రామా తాండాలోని సర్వే నెంబరు 393, 394, 387, 388 లో కొంత మంది రైతులకు మాత్రమే కొత్త పాస్ పుస్తకాలు వచ్చాయని, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొను గోలు చేసిన భూములకు పాస్ పుస్తకాలు ఇచ్చి, ఎన్నో సంవత్సరాలుగా భూమి సాగుచేస్తున్న నిరుపేదలకు పాస్ పుస్తకాలు ఇవ్వలేదని, తక్షణమే ఇప్పించవలసిందిగా ఆ తండా రైతులు రాజు, భక్య తదితరులు ఫిర్యాదు చేయగా తగు విచారణ జరిపి నివేదిక అందాజేయవలసినదిగా నర్సాపూర్ ఆర్డీఓకు సూచించారు.
కౌడిపల్లి మండలం తిమ్మాపూర్ గ్రామంలోని సర్వే నెంబర్ 70లో గత 50 సంవత్సరాల నుంచి కాస్తు చేస్తున్న వారికి పట్టాలు ఇవ్వకుండా 2.39 ఎకరాల భూమిని స్థానిక ఎంపీటీసీ లోను కోసం, రైతు బంధు కోసం తన పేరున పట్టా చేసుకొన్నారని అది రద్దు పరచి అర్హులకు అందజేయవలసినదిగా ఆ గ్రామా ప్రజలు శ్రీనివాస్ గౌడ్ తదితరులు విజ్ఞప్తి చేశారు.
కొల్చారం మండలం చిన్న ఘ్నపూర్‌లో ఉన్న ఐ.ఏం.ఎఫ్.ఎల్. డిపోలో స్థాయిక నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించవలసినదిగా ఐ.ఏం.ఎల్ డిపో హమాలీ ఉద్యమ కమిటీ విజ్ఞప్తి చేయగా పరిశీలించవలసినదిగా కార్మిక శాఖకు సూచించారు.
వడ్డెర కులానికి న్యాయబద్దంగా రావలసిన హక్కులు, తదితర 9 డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లవలసినదిగా తెలంగాణ వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షులు శివరాత్రి అయిలమల్లు విజ్ఞప్తి చేశారు.
బ్రతుకు దెరువు కోసం ఇతరప్రాంతాలకు వెళ్లగా గోల్కొండ వీధిలోని మా ఖాళీ స్థలాన్ని ఆక్రమించుకొని నిర్మాణాలు చేస్తున్నారని తగు చర్యలు తీసుకోవలసిందిగా ఐతారం సాయిలు విజ్ఞప్తి చేయగా పరిశీలించాల్సిందిగా మునిసిపల్ కమీషనర్ కు సూచించారు.
శివ్వంపేట మండలం బొజాతాండా లో 156 సర్వే నెంబరులో 3 ఎకరాల భూమిని మా ముత్తాతల నుండి సాగుచేయుచున్నామని పోదు పట్టా ఇవ్వవలసినదిగా అజిమేర శేఖర్ విజ్ఞప్తి చేసగా పరిశీలించవలసినదిగా జిల్లా గిరిజన అభివృధి అధికారికి సూచించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపులో నాకు డ్రాలో నాకు 22 బ్లాక్ ఎఫ్ 1 రాగా ఇంతవరకు ఇంటి పట్టా ఇవ్వలేదని తూప్రాన్ వాసి తస్లిమా సుల్తానా ఫిర్యాదు చేశారు.
వెల్దుర్తి మండలం యశ్వంత్ రావు పేటలోని సర్వే నెంబరు 52/80/1లో మా తాతాల కాలం నుంచి 3 ఎకరాలు సాగు చేస్తున్నామని పోదు హక్కు కల్పించవలసినదిగా మహేష్ కోరారు. ఈ కార్యక్రమంలో సీపీవో కాసిం, పశు సంవర్ధక శాఖాధికారి విజయ శేఖర్ రెడ్డి, ఆబ్కారీ అధికారి రజాక్, నీటిపారుదల ఈఈ శ్రీనివాస్ రావు, డీఎస్ డీవో విజయలక్ష్మి, మైనారిటీ అధికారి జెంలా నాయక్, డిఎఫ్ఓ రవి ప్రసాద్, మెప్మా పిడి ఇందిర తదితరులు పాల్గొన్నారు.