ఖతార్‌లో ఫిపా ప్రపంచ కప్‌.. ఆ స్టేడియాల నిర్మాణంలో ఎంతమంది చనిపోయారంటే!

విధాత: ఫిపా పుట్‌బాల్‌ ప్రపంచ కప్‌-2022 పోటీలు అరబ్‌ దేశం ఖతార్‌లో అట్టహాసంగా జరుగుతున్నాయి. అందమైన స్టేడియాల్లో జరుగుతున్న ఫుట్‌ బాల్ ఆటను చూసేందుకు ప్రపంచ వ్యాప్తంగా క్రీడాభిమానులు ఉర్రూతలూగుతున్నారు. అయితే ఆ అందమైన స్టేడియాల నిర్మాణా పునాదుల్లో ఎంత మంది ఊపిరిలున్నాయో ఎవరికీ తెలియదు. ప్రపంచ ఫుట్‌ బాల్‌ పోటీ నిర్వహణకు ఖతార్‌ను 2010లో ఫిపా ఖరారు చేసింది. దీని కోసం ఖతార్‌లో 2014నుంచి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఖతార్‌లోని ఐదు ప్రధాన నగరాల్లో సకల […]

  • By: krs    latest    Nov 30, 2022 10:54 AM IST
ఖతార్‌లో ఫిపా ప్రపంచ కప్‌.. ఆ స్టేడియాల నిర్మాణంలో ఎంతమంది చనిపోయారంటే!

విధాత: ఫిపా పుట్‌బాల్‌ ప్రపంచ కప్‌-2022 పోటీలు అరబ్‌ దేశం ఖతార్‌లో అట్టహాసంగా జరుగుతున్నాయి. అందమైన స్టేడియాల్లో జరుగుతున్న ఫుట్‌ బాల్ ఆటను చూసేందుకు ప్రపంచ వ్యాప్తంగా క్రీడాభిమానులు ఉర్రూతలూగుతున్నారు. అయితే ఆ అందమైన స్టేడియాల నిర్మాణా పునాదుల్లో ఎంత మంది ఊపిరిలున్నాయో ఎవరికీ తెలియదు.

ప్రపంచ ఫుట్‌ బాల్‌ పోటీ నిర్వహణకు ఖతార్‌ను 2010లో ఫిపా ఖరారు చేసింది. దీని కోసం ఖతార్‌లో 2014నుంచి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఖతార్‌లోని ఐదు ప్రధాన నగరాల్లో సకల సౌకర్యాలతో ఆధునాతన నిర్మాణాలు, స్టేడియాల నిర్మాణం కోసం వేలాది మంది ఎనిమిదేండ్లుగా రాత్రింబవళ్లు శ్రమించారు.

ఆ క్రమంలో ఎంతో మంది చనిపోయారు. అధికారిక లెక్కల ప్రకారం 40 మంది చనిపోయారని, అందులో 37 మంది ఖతార్‌ వాసులేనని ఖతార్‌ సుప్రీం కమిటీ సెక్రటరీ జనరల్‌ హసన్‌ అల్‌-థవాడీ తెలిపారు. కానీ ఆ నిర్మాణ పనుల సందర్భంగా జరిగిన ప్రమాదాల గురించి అనేక కథనాలు, విమర్శలు వచ్చాయి.

ఈ క్రమంలో హసన్‌ అల్‌ థవాడీ మాట మార్చారు. స్టేడియాల నిర్మాణం సందర్భంగా ఎంతమంది చనిపోయారన్నది లెక్కలేదు కానీ, 400 నుంచి 500 మంది దాకా చనిపోయి ఉండొచ్చని చెప్పుకొచ్చారు. అయితే ఖతార్‌లో ఎక్కువగా కార్మికులుగా పనిచేస్తున్న వారు ఇండియా, పాకిస్థాన్‌, శ్రీలంక దేశాల నుంచే వ‌చ్చి ఉంటారని ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు.