Ind vs WI | ప్ర‌యోగాలు చేసి చేతులు కాల్చుకున్న టీమిండియా.. విండీస్‌పై దారుణ‌మైన ఓట‌మి

Ind vs WI: మ‌రి కొద్ది రోజుల‌లో మొద‌లు కానున్న వర‌ల్డ్ క‌ప్ కోసం టీమిండియా జ‌ట్టు ఇప్ప‌టి నుండి ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తుంది. ప్ర‌స్తుతం వెస్టిండీస్‌తో జ‌రుగుతున్న వ‌న్డే సిరీస్‌లో ఆటగాళ్ల టాలెంట్‌ని ప‌రీక్షిస్తున్నారు. అలానే అనేక ప్ర‌యోగాలు చేస్తున్నారు. తొలి వ‌న్డేలో యువ ఆటగాళ్లకి ఎక్కువ స‌మ‌యం బ్యాటింగ్ చేసే అవ‌కాశం క‌ల్పించిన ఎవ‌రు ఉప‌యోగించుకోలేక‌పోయారు. ఇప్పుడు రెండో వ‌న్డేలో కూడా సేమ్ రిపీట్ చేశాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా, 40.5 ఓవర్లలో […]

  • By: sn    latest    Jul 30, 2023 2:13 AM IST
Ind vs WI | ప్ర‌యోగాలు చేసి చేతులు కాల్చుకున్న టీమిండియా.. విండీస్‌పై దారుణ‌మైన ఓట‌మి

Ind vs WI: మ‌రి కొద్ది రోజుల‌లో మొద‌లు కానున్న వర‌ల్డ్ క‌ప్ కోసం టీమిండియా జ‌ట్టు ఇప్ప‌టి నుండి ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తుంది. ప్ర‌స్తుతం వెస్టిండీస్‌తో జ‌రుగుతున్న వ‌న్డే సిరీస్‌లో ఆటగాళ్ల టాలెంట్‌ని ప‌రీక్షిస్తున్నారు. అలానే అనేక ప్ర‌యోగాలు చేస్తున్నారు. తొలి వ‌న్డేలో యువ ఆటగాళ్లకి ఎక్కువ స‌మ‌యం బ్యాటింగ్ చేసే అవ‌కాశం క‌ల్పించిన ఎవ‌రు ఉప‌యోగించుకోలేక‌పోయారు. ఇప్పుడు రెండో వ‌న్డేలో కూడా సేమ్ రిపీట్ చేశాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా, 40.5 ఓవర్లలో 181 పరుగులకి కుప్ప‌కూలింది. ఓపెనర్లు ఇషాన్ కిషన్, శుబ్‌మన్ గిల్ క‌లిసి తొలి వికెట్‌కి 90 పరుగుల భాగస్వామ్యం జోడించిన కూడా త‌ర్వాతి బ్యాట్స్‌మెన్స్ దానిని భారీ స్కోర్‌గా మ‌ల‌చ‌లేక‌పోయారు.

తొలి వికెట్‌గా 49 బంతుల్లో 5 ఫోర్లతో 34 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్ ఔట్ కాగా, ఆ త‌ర్వాత వెంట‌న‌వెంటే వికెట్స్ ప‌డ్డాయి. గిల్ అవుటైన తర్వాతి ఓవర్‌లోనే ఇషాన్ కిషన్ 55 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 55 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఇక నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన అక్షర్ పటేల్ త్వ‌ర‌గానే అవుట్ అయ్యాడు. కెప్టెన్ హార్ధిక్ పాండ్యా 14 బంతుల్లో 7 పరుగులు చేసి ఔట్ కావ‌డంతో 113 పరుగులకే నాలుగు వికెట్స్ కోల్పోయింది టీమిండియా..ఇక చాలా రోజుల తర్వాత జట్టులోకి వచ్చిన సంజూ శాంసన్ మంచి అవకాశాన్నివినియోగించుకోలేక‌పోయాడు. 19 బంతుల్లో 9 పరుగులు చేసిన సంజూ ఔట‌య్యాడు. ఇక మధ్యలో వ‌ర్షం వ‌ల‌న కాస్త అంత‌రాయం క‌ల‌గ‌గా, ఆ త‌ర్వాత 21 బంతులు ఆడి 10 పరుగులు చేసిన రవీంద్ర జడేజా, 25 బంతుల్లో 3 ఫోర్లతో 24 పరుగులు చేసిన సూర్య కుమార్ యాద‌వ్ త్వ‌ర‌గానే ఔట‌య్యారు. మిగ‌తా బ్యాట్స్మెన్స్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిల‌వ‌లేక‌పోయారు.

దీంతో భార‌త జ‌ట్టు181 ప‌రుగుల‌కి ఆలౌట్ అయింది. అయితే 182 పరుగుల స్వల్ప లక్ష్యఛేదనలో వెస్టిండీస్‌కి మంచి ఆరంభం రాగా, త‌ర్వాత బ్యాట్స్‌మెన్స్ వెంట వెంట‌నే ఔట‌య్యారు. కాని షై హోప్ 80 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 63 పరుగులు చేయగా కెసీ కార్టీ 65 బంతుల్లో 4 ఫోర్లతో 48 పరుగులు చేసి వెస్టిండీస్ జ‌ట్టుకి మంచి విజ‌యాన్ని అందించారు. సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేకుండా బరిలో దిగిన భారత జట్టు, వెస్టిండీస్ చేతుల్లో 6 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చ‌వి చూసింది. ఇక చివ‌రి వ‌న్డే ఆగస్టు 1న జరిగ‌నుండ‌గా, ఆ మ్యాచ్ సిరీస్‌ విజేతను డిసైడ్ చేయనుంది..