Ind vs WI:నేటి నుండే భార‌త్- వెస్టిండీస్ మ్యాచ్.. ఉచితంగా ఎక్క‌డ‌, ఎప్పుడు చూడ‌వ‌చ్చు..!

Ind vs WI: గత రెండు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్స్‌లో భార‌త్ రన్న‌ర‌ప్‌తో స‌రిపెట్టుకున్న విష‌యం తెలిసిందే. ఇక ఇప్పుడు 2023-25 సర్కిల్‌ ప్రారంభించేందుకు రెడీ అయింది.ఈ క్ర‌మంలో రోహిత్ సేన జూలై 12 నుండి వెస్టిండీస్‌తో తొలి టెస్ట్ ఆడ‌నుంది. అనుభవలేమితో కూడి ఉన్న వెస్టిండీస్.. భారత్ వంటి పటిష్ట జ‌ట్టుతో పోరాటానికి దిగుతుండ‌గా, ఈ మ్యాచ్ ర‌స‌వ‌త్త‌రంగా ఉంటుంద‌ని తెలుస్తుంది.టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)లో కెప్టెన్ రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు ఓడిపోయిన తర్వాత […]

  • By: sn    latest    Jul 12, 2023 5:03 AM IST
Ind vs WI:నేటి నుండే భార‌త్- వెస్టిండీస్ మ్యాచ్.. ఉచితంగా ఎక్క‌డ‌, ఎప్పుడు చూడ‌వ‌చ్చు..!

Ind vs WI: గత రెండు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్స్‌లో భార‌త్ రన్న‌ర‌ప్‌తో స‌రిపెట్టుకున్న విష‌యం తెలిసిందే. ఇక ఇప్పుడు 2023-25 సర్కిల్‌ ప్రారంభించేందుకు రెడీ అయింది.ఈ క్ర‌మంలో రోహిత్ సేన జూలై 12 నుండి వెస్టిండీస్‌తో తొలి టెస్ట్ ఆడ‌నుంది. అనుభవలేమితో కూడి ఉన్న వెస్టిండీస్.. భారత్ వంటి పటిష్ట జ‌ట్టుతో పోరాటానికి దిగుతుండ‌గా, ఈ మ్యాచ్ ర‌స‌వ‌త్త‌రంగా ఉంటుంద‌ని తెలుస్తుంది.టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)లో కెప్టెన్ రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు ఓడిపోయిన తర్వాత వారికి ఇదే తొలి టెస్ట్ సిరీస్ కాగా, ఇది ఎప్పుడు మొద‌లు కానుంది, ఎందులో చూడ‌వ‌చ్చు అని అంద‌రిలో అనేక అనుమానాలు ఉన్నాయి.

భారత్, వెస్టిండీస్ మ‌ధ్య జ‌ర‌గ‌నున్న‌ తొలి టెస్టు మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఆట దాదాపు 8 గంటల పాటు సాగనున్న నేప‌థ్యంలో తెల్లవారుజామున 3:30 గంటలకు ముగుస్తుంది. ఈ టెస్ట్ సిరీస్‌ను అభిమానులు పూర్తిగా ఉచితంగా వీక్షించే అవ‌కాశం కూడా ఉంది. హాట్ స్టార్ లేదా సోని లివ్‌కి సబ్‌స్క్రిప్షన్ చెల్లించే బదులు జియో సినిమాలో వెస్టిండీస్, భారతదేశం మధ్య టెస్ట్ సిరీస్‌ను ఉచితంగా చూడవచ్చు.అలానే ఈ టెస్ట్ మ్యాచ్ భారతదేశంలో దూరదర్శన్ ద్వారా లైవ్ లో చూసే అవ‌కాశం ఉంది.

మొదటి టెస్ట్ డొమినికాలో జ‌ర‌గ‌నుండ‌గా, ఇప్పటికే ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించిన వెస్టిండీస్ జ‌ట్టుపై రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు కరీబియన్ గడ్డపై సత్తా చాటాల‌ని భావిస్తుంది. ఈ సిరీస్‌లో ఛతేశ్వర్‌ పుజారాకు చోటు దక్కక‌పోగా, రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్‌లలో ఎవరికి స్థానం దక్కుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

తుది జట్లు (అంచనా)

భారత్‌: రోహిత్‌ (కెప్టెన్‌), గిల్‌, యశస్వి, కోహ్లీ, రహానే, భరత్‌, జడేజా, అశ్విన్‌, శార్దూల్‌, సిరాజ్‌, ముఖేశ్‌.

వెస్టిండీస్‌: బ్రాత్‌వైట్‌ (కెప్టెన్‌), టగ్‌నరైన్‌ చందర్‌పాల్‌, రైమాన్‌, బ్లాక్‌వుడ్‌, చేజ్‌, జోషువా, రాకీమ్‌ కార్న్‌వాల్‌, హోల్డర్‌, గాబ్రియల్‌, అల్జారీ జోసెఫ్‌, కిమారో రోచ్‌.