Chandrababu | పవన్, పురంధేశ్వరి.. ఇండియా మద్దతు బాబుకే

Chandrababu విధాత‌:  చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ స్కాములో అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు రోడ్డు మార్గంలో విజయవాడ తీసుకొస్తుండగా మార్గమధ్యలో టిడిపి కార్యకర్తలు ఆందోళనకు దిగుతున్నారు. ఇదిలా ఉండగా ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని కాంగ్రెస్ సారధ్యంలోని ఇండియా కూటమి ట్వీట్ చేసింది. తమ మద్దతు చంద్రబాబుకు ఉంటుందని ఆ కూటమి పేర్కొనగా ఇక బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సైతం ఇది ఒక కక్ష పూరిత చర్య అని ఆరోపిస్తూ ప్రభుత్వ చర్యలను ఖండించారు. ఇలాంటి […]

Chandrababu | పవన్, పురంధేశ్వరి.. ఇండియా మద్దతు బాబుకే

Chandrababu

విధాత‌: చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ స్కాములో అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు రోడ్డు మార్గంలో విజయవాడ తీసుకొస్తుండగా మార్గమధ్యలో టిడిపి కార్యకర్తలు ఆందోళనకు దిగుతున్నారు. ఇదిలా ఉండగా ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని కాంగ్రెస్ సారధ్యంలోని ఇండియా కూటమి ట్వీట్ చేసింది. తమ మద్దతు చంద్రబాబుకు ఉంటుందని ఆ కూటమి పేర్కొనగా ఇక బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సైతం ఇది ఒక కక్ష పూరిత చర్య అని ఆరోపిస్తూ ప్రభుత్వ చర్యలను ఖండించారు. ఇలాంటి ప్రతీకార చర్యలకు బిజెపి వ్యతిరేకం అని ఆమె అన్నారు.

పవన్ కళ్యాణ్ సైతం బయటికి వచ్చారు. విశాఖలో వారాహి యాత్ర ముగిశాక హైదరాబాద్ వెళ్ళిపోయిన పవన్ ప్రస్తుతం సినిమా షూటింగులో ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్ సందర్భంగా అయన మాట్లాడుతూ ఇది అప్రజాస్వామికం అని ఆరోపిస్తూ ఇది జగన్ లోని ప్రతీకార ధోరణికి నిదర్శనం అన్నారు. ఆయనకు సరిగా నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్ చేశారని , ఇలాంటి చర్యలను తాము ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని అన్నారు. మరోవైపు పాదయాత్రలో ఉన్న లోకేష్ సైతం తండ్రిని కలిసేందుకు విజయవాడ వస్తున్నట్లు తెలుస్తోంది. అయన కూడా చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ ఆందోళన చేశారు.

ఇక జిల్లాల్లోని టీడీపీ సీనియర్ నాయకులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తూ వస్తున్నా పోలీసులు రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేసినా నిర్వీర్యం చేస్తున్నారు. గుంపులుగా వెళుతున్న విద్యార్థులను సైతం అలా వెళ్లోద్దని.. విడివిడిగా ఆర్టీసీ నిలిచిపోగా స్కూళ్ళు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. మొత్తానికి రాష్ట్రం మొత్తం ప్రశాంతంగా ఉంటూనే గుంభనగా ఉంది. ఈ కేసుతోబాటు మరి కొన్ని అవినీతి కేసుల్లో ఇంకొన్ని అరెస్టులు ఉండొచ్చని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ఈమేరకు మంత్రులు అంబటి, పెద్దిరెడ్డి మాట్లాడుతూ అవినీతి కేసులలో ఎవరినీ వదిలేది లేదన్నారు.