India Debits | భారీగా పెరిగిన దేశం అప్పులు..! ప్రతి పౌరుడిపైన ఎంత భారం పడుతుందో తెలుసా..?

  • By: krs    latest    Oct 01, 2023 7:35 AM IST
India Debits | భారీగా పెరిగిన దేశం అప్పులు..! ప్రతి పౌరుడిపైన ఎంత భారం పడుతుందో తెలుసా..?

India Debits | భారతదేశ అప్పులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. పెరుగుతున్న అప్పులపై ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇవి ఓ ప్రైవేటు కంపెనీలు తెలిపిన వివరాలు కానే కాదు.. ప్రభుత్వ లెక్కల ప్రకారం.. ప్రభుత్వ స్థూల రుణంలో 2.2శాతం పెరుగుదల నమోదు కాగా.. రుణాల మొత్తం రూ.159లక్షల కోట్ల మార్క్‌ను దాటింది.




ప్రస్తుతం అప్పులు ఇదే విధంగా కొనసాగితే.. త్వరలోనే రూ.160లక్షల కోట్ల మార్క్‌ను దాటే అవకాశం ఉన్నది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కేంద్ర ప్రభుత్వ స్థూల రుణంలో మొత్తం 2.2 శాతం పెరిగింది. దీంతో అప్పు రూ.159.53 లక్షల కోట్లకు పెరిగింది.




ప్రస్తుత దేశ జనాభా బిలియన్‌ 40కోట్లు. ఈ లెక్క దేశంలోని ప్రతి పౌరుడిపై ప్రస్తుతం రూ.1.13లక్షల కంటే ఎక్కువగానే అప్పు ఉండనున్నది. అయితే, ఈ అప్పుల పెరుగుదలకు సంబంధించిన గణాంకాలను ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ నివేదిక ద్వారా సమర్పించింది.




ఈ నివేదిక ప్రకారం.. మార్చి చివరి వారంలో కేంద్ర సర్కారు స్థూల రుణం రూ.156.08లక్షల కోట్లు. 2023 ఏప్రిల్-జూన్ త్రైమాసికం నాటికి ఇది 2.2 శాతం పెరిగింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ బడ్జెట్ విభాగానికి చెందిన పబ్లిక్ డెట్ మేనేజ్‌మెంట్ సెల్ ఏప్రిల్-జూన్ 2010-11 నుంచి రుణ నిర్వహణపై క్రమం తప్పకుండా త్రైమాసిక నివేదికను విడుదల చేస్తుంటుంది.




ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కేంద్రం డేటెడ్ సెక్యూరిటీల ఇష్యూ, డిస్పోజల్ ద్వారా రూ.4.08 లక్షల కోట్ల స్థూల మొత్తాన్ని సేకరించగా.. సర్దుబాటు తర్వాత రూ.2.71 లక్షల కోట్లకు చేరింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో వ్యాట్ సగటు రాబడి 7.13 శాతంగా నమోదు కాగా.. జనవరి-మార్చి త్రైమాసికంలో 7.34 శాతంగా ఉన్నది.




ఇదిలా ఉండగా.. ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశం అప్పులు విపరీతంగా పెరిగాయనే విమర్శలున్నాయి. మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక రూ.100లక్షలకోట్లకుపైగా రుణాలు తీసుకున్నారు. వీటిపై ఏటా 10లక్షల కోట్లకుపైగా వడ్డీని చెల్లిస్తున్నది.




భారత్‌కు స్వాతంత్య్రం  వచ్చాక 67 ఏళ్లలో 14 మంది ప్రధానులు మొత్తం రూ.55,87,147 కోట్ల అప్పులు చేయగా.. ప్రధాని నరేంద్ర మోదీ పాలనలోనే 100కోట్లకుపైగా అప్పులు నమోదయ్యాయి. మాజీ ప్రధానులంతా ఏటా సగటున రూ.83,000 కోట్ల రుణాన్ని పొందగా.. ప్రధాని నరేంద్ర మోదీ మోదీ సగటున నెలకు దాదాపు రూ.లక్ష కోట్ల రుణాన్ని తీసుకున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.