దేశంలో కొత్త కోవిడ్ కేసులు 529
భారతదేశంలో ఒకే రోజులో 529 కొత్త కొవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. దాంతో యాక్టివ్ కేసు సంఖ్య 4,093కు చేరినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది

- 4,093కు చేరిన యాక్టివ్ కేసు సంఖ్య
- కరోనా కారణంగా ముగ్గురు మృతి
- కర్ణాటకలో ఇద్దరు, గుజరాత్‌లో ఒకరు
విధాత: భారతదేశంలో ఒకే రోజులో 529 కొత్త కొవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. దాంతో యాక్టివ్ కేసు సంఖ్య 4,093కు చేరినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. 24 గంటల వ్యవధిలో మూడు కొత్త మరణాలు సంభవించాయి. కర్ణాటకలో ఇద్దరు, గుజరాత్‌లో ఒకరు చనిపోయినట్టు బుధవారం ఉదయం 8 గంటలకు విడుదలచేసిన బులెటిన్‌లో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. డిసెంబర్ 5 వరకు రోజువారీ కొవిడ్ కేసుల సంఖ్య రెండంకెలకే పడిపోయింది. అయితే కొత్త వాతావరణం, శీతల పరిస్థితుల కారణంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.
2020 ప్రారంభంలో రోజువారీ కొవిడ్ కేసులు లక్షల్లో నమోదయ్యాయి. 4.5 కోట్ల మందికిపైగా ప్రజలు కరోనా బారిన పడ్డారు. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా సుమారు నాలుగేండ్లలో కరోనాతో 5.3 లక్షల మంది మరణించారు. ఆరోగ్యమంత్రిత్వశాఖ వెబ్‌సైట్ ప్రకారం.. వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య జాతీయ రికవరీ రేటు 98.81 శాతంతో 4.4 కోట్లకు పైగా ఉన్నది. మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది