Indian-Origin Girl | 10 ఏళ్ల‌కే 50 దేశాలు చుట్టేసిన బాలిక‌.. అదీ.. స్కూల్‌కి ఒక్క రోజు సెలవు పెట్టకుండా

Indian-Origin Girl | విధాత‌: ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా 50 దేశాలు చుట్టేసింది 10 ఏళ్ల బాలిక‌. స్కూల్‌కు ఒక్క రోజు కూడా సెల‌వు పెట్ట‌కుండా ఈ యాత్ర‌లు చేసిందంటే విశేష‌మే క‌దా.. సౌత్ లండ‌న్‌ (London)లో నివ‌సించే దీప‌క్‌, అవిలాష‌ల కుమార్తె అదితి. ప‌ర్యాట‌క ప్ర‌దేశాల‌ను ఇష్ట‌ప‌డే త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి ఇప్ప‌టి వ‌రకు 50 దేశాల‌ను చుట్టేసింది. ఆమె తిరిగిన దేశాల్లో ఎక్కువ‌గా యూర‌ప్ దేశాల‌తో పాటు సింగ‌పూర్‌, జ‌పాన్‌, నేపాల్ సైతం […]

Indian-Origin Girl | 10 ఏళ్ల‌కే 50 దేశాలు చుట్టేసిన బాలిక‌.. అదీ.. స్కూల్‌కి ఒక్క రోజు సెలవు పెట్టకుండా

Indian-Origin Girl |

విధాత‌: ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా 50 దేశాలు చుట్టేసింది 10 ఏళ్ల బాలిక‌. స్కూల్‌కు ఒక్క రోజు కూడా సెల‌వు పెట్ట‌కుండా ఈ యాత్ర‌లు చేసిందంటే విశేష‌మే క‌దా.. సౌత్ లండ‌న్‌ (London)లో నివ‌సించే దీప‌క్‌, అవిలాష‌ల కుమార్తె అదితి. ప‌ర్యాట‌క ప్ర‌దేశాల‌ను ఇష్ట‌ప‌డే త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి ఇప్ప‌టి వ‌రకు 50 దేశాల‌ను చుట్టేసింది.

ఆమె తిరిగిన దేశాల్లో ఎక్కువ‌గా యూర‌ప్ దేశాల‌తో పాటు సింగ‌పూర్‌, జ‌పాన్‌, నేపాల్ సైతం ఉన్నాయి. అదితిని ఒక యాత్రికురాలిగా (World Traveler) చేయాల‌ని ఆమె త‌ల్లిదండ్రులు మొద‌ట్లోనే నిర్ణ‌యించు కున్నారు. విభిన్న సంస్కృతులు, ఆహార‌పు అల‌వాట్ల‌ను కుమార్తెకు ప‌రిచ‌యం చేయ‌డానికి పూనుకున్నారు.

అయితే చ‌దువు దెబ్బ‌తిన‌కుండా, స్కూల్‌కు ఎప్పుడూ ఆబ్సెంట్ కాకుండానే ఈ యాత్ర ప్ర‌ణాళిక‌ను వారు ర‌చించేవారు. ఈ ప‌ర్య‌ట‌న‌ల వ‌ల్ల ఆమె ఒక్క‌రోజు కూడా పాఠ‌శాల‌కు ఆబ్సెంట్ కాక‌పోవ‌డం విశేషం. వారాంత‌పు సెల‌వుల్లోనూ, వార్షిక సెల‌వుల్లోనూ వారు ఈ యాత్ర‌లు చేసేవారు. తాము స‌గ‌టున ఇప్ప‌టి వ‌ర‌కు ఏడాదికి రూ.21 ల‌క్ష‌లు ఖ‌ర్చుపెట్టామ‌ని అదితి త‌ల్లిదండ్రులు వెల్ల‌డించారు. అందులో ప్ర‌తి పైసా త‌మ‌కు ఆనందాన్నిచ్చింద‌ని వ్యాఖ్యానించారు.

అదితికి సుమారు 3 ఏళ్లు ఉన్న‌ప్ప‌టి నుంచి ఈ యాత్ర‌లు కొన‌సాగుతున్నాయి. బాగా చిన్న‌తనంలో త‌న‌ను వారానికి రెండున్న‌ర రోజులు మాత్ర‌మే స్కూల్‌కు పంపించే వారిమ‌ని. మిగిలిన వారంలో వేరే దేశంలో ఉండేవారిమ‌ని తండ్రి దీప‌క్ తెలిపారు. ‘ఇప్పుడైతే శుక్ర‌వారం రాత్రి త‌న‌ని తీసుకుని నేరుగా విమానాశ్రయానికి వెళ్లిపోతున్నాం. ఆదివారం అర్ధరాత్రి మేము వెళ్లిన దేశం నుంచి బ‌య‌లుదేరి సోమ‌వారం ఉద‌యానికి లండ‌న్ వ‌చ్చేస్తున్నాం’ అని పేర్కొన్నారు.

పైసా పైసా పొదుపు చేసి..

మెట్రో క‌థ‌నం ప్ర‌కారం.. అదితి త‌ల్లిదండ్రులు ఇద్ద‌రూ ఎకౌంటెంట్స్‌గా ప‌ని చేస్తున్నారు. వీరిద్ద‌రూ బ‌య‌ట ఫుడ్ తిన‌రు. ప్రైవేట్ వాహ‌నాలు వాడ‌కుండా ప‌బ్లిక్ ట్రాన్స్‌పోర్టునే ఉప‌యోగిస్తారు. ఆఫీసుకు కారు మీద వెళితే డ‌బ్బులు అయిపోతాయ‌ని వ‌ర్క్ ఫ్రం హోం విధానంలో ప‌నిచేసుకుంటున్నారు. ఇలా డ‌బ్బులు పొదుపు చేసుకుని ప్ర‌పంచ‌యాత్ర‌లు చేస్తున్నార‌ని ఈ క‌థ‌నం వెల్ల‌డించింది. ‘నాకంటూ ఒక ఇష్ట‌మైన దేశం అంటూ ఏమీ లేదు.

అయితే నేపాల్‌, జార్జియా, అర్మేనియాలు బాగుంటాయి’ అని అదితి వెల్ల‌డించింది. ముఖ్యంగా నేపాల్‌లో గుర్ర‌పు స్వారీ, పొడ‌వైన కేబుల్ కార్‌, మంచు కొండ‌లు క‌ళ్లు తిప్పుకోనివ్వ‌వు అని చెప్పుకొచ్చింది. త‌న‌కు మూడేళ్లున్న‌పుడు తొలిసారి చేసిన జ‌ర్మ‌నీ ట్రిప్ నుంచి ఇప్ప‌టి వర‌కూ అన్నీ త‌న‌కు గుర్తున్నాయ‌ని అదితి వెల్ల‌డించింది. అన్న‌ట్టు ఇప్పుడు వీరు ముగ్గురితో పాటు రెండేళ్ల వ‌య‌సున్న అదితి చెల్లెలు అద్వైత కూడా ప్ర‌పంచ‌యాత్ర‌లు ప్రారంభించింది.