Indian Police Medal | అడిషనల్ ఎస్పీ ప్రసాద రావుకు ఇండియన్ పోలీస్ మెడల్
Indian Police Medal 1993లో ఉత్తమ సేవ, 2009లో కఠిన సేవ పతకం విధాత, ఉమ్మడి నల్గొండ బ్యూరో: నల్గొండ జిల్లా అదనపు ఎస్పీ కె.ఆర్.కె ప్రసాద రావు ఇండియన్ పోలీస్ మెడల్ కు ఎంపికయ్యారు. ఆయన ఆర్‌ఎస్‌ఐగా 1991 సంవత్సరంలో ఎంపికై 1992 నుంచి 5 సంవత్సరాల పాటు మొట్టమొదటి గ్రే హౌండ్స్ టీంలో విధులు నిర్వర్తించారు. 1993 లో గ్రే హౌండ్స్ నందు విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో ఉత్తమ సేవ పతకం, 2009 వ […]

Indian Police Medal
- 1993లో ఉత్తమ సేవ, 2009లో కఠిన సేవ పతకం
విధాత, ఉమ్మడి నల్గొండ బ్యూరో: నల్గొండ జిల్లా అదనపు ఎస్పీ కె.ఆర్.కె ప్రసాద రావు ఇండియన్ పోలీస్ మెడల్ కు ఎంపికయ్యారు.
ఆయన ఆర్‌ఎస్‌ఐగా 1991 సంవత్సరంలో ఎంపికై 1992 నుంచి 5 సంవత్సరాల పాటు మొట్టమొదటి గ్రే హౌండ్స్ టీంలో విధులు నిర్వర్తించారు.
1993 లో గ్రే హౌండ్స్ నందు విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో ఉత్తమ సేవ పతకం, 2009 వ సంవత్సరంలో కఠిన సేవ పతకం అందుకున్నారు.
ఆర్ఎస్ఐ నుండి సివిల్ ఎస్‌ఐగా కన్వర్షన్ అయ్యి వివిధ హోదాల్లో కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, నిర్మల్, ఖమ్మం జిల్లాల్లో విధులు నిర్వర్తించారు.
కాగా తాను ఇండియన్ పోలీస్ మెడల్ కు ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉందని ప్రసాద్‌రావు ఆనందం వ్యక్తం చేశారు.