రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. వాట్సాప్‌ ద్వారా ఈ-క్యాటరింగ్‌ సేవలు..!

IRCTC | రైలు ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ మరో శుభవార్త చెప్పింది. రైలు ప్రయాణంలో తమకు ఇష్టమైన ఆహారాన్ని వాట్సాప్‌ ద్వారా బుక్‌ చేసుకునే విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపింది. అయితే, ఈ సేవలు రెండు దశల్లో అందుబాటులోకి రానున్నాయి. తొలి దశలో ఈ-టికెట్‌ బుక్‌ చేసుకోగానే ప్రయాణికుడికి ecatering.irctc.co.in లింక్‌తో వాట్సాప్‌ మెస్సేజ్‌ వస్తుంది. ఈ లింక్‌పై క్లిక్‌ చేస్తే రైలు వెళ్లే రూట్‌లోని స్టేషన్లలో ఉండే రెస్టారెంట్ల నుంచి ఫుడ్‌ను ఆర్డర్‌ చేసుకోవచ్చు. ఆ తర్వాత […]

రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. వాట్సాప్‌ ద్వారా ఈ-క్యాటరింగ్‌ సేవలు..!

IRCTC | రైలు ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ మరో శుభవార్త చెప్పింది. రైలు ప్రయాణంలో తమకు ఇష్టమైన ఆహారాన్ని వాట్సాప్‌ ద్వారా బుక్‌ చేసుకునే విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపింది. అయితే, ఈ సేవలు రెండు దశల్లో అందుబాటులోకి రానున్నాయి. తొలి దశలో ఈ-టికెట్‌ బుక్‌ చేసుకోగానే ప్రయాణికుడికి ecatering.irctc.co.in లింక్‌తో వాట్సాప్‌ మెస్సేజ్‌ వస్తుంది. ఈ లింక్‌పై క్లిక్‌ చేస్తే రైలు వెళ్లే రూట్‌లోని స్టేషన్లలో ఉండే రెస్టారెంట్ల నుంచి ఫుడ్‌ను ఆర్డర్‌ చేసుకోవచ్చు. ఆ తర్వాత బెర్తుల వద్దకే ఐఆర్‌సీటీసీ ఆహారాన్ని అందిస్తుంది.

ఈ సేవలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. రెండో దశలో పూర్తిగా వాట్సాప్‌ ద్వారానే ఫుడ్‌ ఆర్డర్‌ ఇవ్వొచ్చు. ప్రయాణికులు 8750001323కు వాట్సాప్‌ చేస్తే ఏఐ ఆధారిత చాట్‌బోట్‌ రిప్లయ్‌ ఇస్తుంది. అందులోని ఆప్షన్లను ఎంపిక చేసుకుంటూ తమకు కావాల్సిన ఆహారాన్ని ఆర్డర్‌ పెట్టుకోవచ్చు. తొలుత ప్రయోగాత్మకంగా కొన్ని ఎంపిక చేసిన రైళ్లలో త్వరలో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ప్రయాణికుల నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్‌ను బట్టి ఈ సర్వీసులను మిగతా రైళ్లలో ప్రవేశపెట్టాలని ఐఆర్‌సీటీసీ భావిస్తోంది. ఐఆర్‌సీటీసీ ఇప్పటికే ‘ఫుడ్‌ ఆన్‌ ట్రాక్‌’ యాప్‌, catering.irctc.co.in వెబ్‌సైట్‌ ద్వారా రైళ్లలో ఈ-క్యాటరింగ్‌ సేవలను అందిస్తుండగా.. ప్రతి రోజూ సగటున 50వేల మంది ప్రయాణికులకు మీల్స్‌ అందిస్తోంది.