Polar Research Ship | మరో 5 ఏళ్లలో భారత్‌కు తొలి పోలార్ రీసెర్చ్ వెసెల్
Polar Research Ship | విధాత: భారతదేశపు మొట్టమొదటి పోలార్ రీసెర్చ్ వెసెల్ (పీఆర్‌వీ) తయారుకావడానికి మరో ఐదేళ్ల సమయం పడుతుందని భూగర్భ పరిశోధనల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తాజాగా వెల్లడించారు. ఈ వెసెల్ ద్వారా అంటార్కిటికా (Antarctica) లో ఉన్న భారత పరిశోధనా కేంద్రాల పర్యవేక్షణకు, అధ్యయనాలకు మార్గం మరింత సుగమమవుతుందని తెలిపారు. ఈ మేరకు రాజ్యసభలో ప్రకటించిన కేంద్రమంత్రి.. వెసెల్ (Vessel) నిర్మాణ ప్రతిపాదన ఈ ఆర్థిక సంవత్సరంలోనే కేబినెట్ ముందుకు రానుందని […]

Polar Research Ship | విధాత: భారతదేశపు మొట్టమొదటి పోలార్ రీసెర్చ్ వెసెల్ (పీఆర్‌వీ) తయారుకావడానికి మరో ఐదేళ్ల సమయం పడుతుందని భూగర్భ పరిశోధనల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తాజాగా వెల్లడించారు. ఈ వెసెల్ ద్వారా అంటార్కిటికా (Antarctica) లో ఉన్న భారత పరిశోధనా కేంద్రాల పర్యవేక్షణకు, అధ్యయనాలకు మార్గం మరింత సుగమమవుతుందని తెలిపారు. ఈ మేరకు రాజ్యసభలో ప్రకటించిన కేంద్రమంత్రి.. వెసెల్ (Vessel) నిర్మాణ ప్రతిపాదన ఈ ఆర్థిక సంవత్సరంలోనే కేబినెట్ ముందుకు రానుందని పేర్కొన్నారు.
పీఆర్‌వీ నిర్మాణానికి 2014లో రూ.1,051 కోట్లతో టెండర్లు పిలిచినప్పటికీ.. తర్వాత భారత ప్రభుత్వం ఆ ప్రాజెక్టును నిలిపివేసిందన్నారు. తయారీ సంస్థ ఒప్పందాల్లో లేని కొన్ని నిబంధనలను ముందుక తీసుకురావడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. మళ్లీ పీఆర్‌వీ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లనున్నామని.. ప్రస్తుతం దీని తయారీకి రూ.2600 కోట్లు ఖర్చవుతుందని కేంద్రమంత్రి అంచనా వేశారు.
పోలార్ నౌకలను తయారుచేసే దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నప్పటికీ… ఈ నౌకను భారత్‌లోనే నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. అంటార్కిటికాలో ప్రస్తుతం భారత్‌కు భారతి, మైత్రి, దక్షిణ గంగోత్రి అనే పరిశోధన కేంద్రాలున్నాయి. వీటి దగ్గరకు వెళ్లాలంటే వేల కి.మీ. గడ్డ కట్టిన భారీ మంచు ఫలకాలను బద్దలు కొట్టుకుంటూ వెళ్లాలి. అందుకే ఇక్కడ పోలార్ రీసెర్చ్ వెసెల్స్ (Polar Research Vessel) అనే ప్రత్యేక నౌకలను శాస్త్రవేత్తలు వినియోగిస్తారు.