Assam | ఠాణాలోనే.. బట్టలు తొలగించమని.. నగ్న చిత్రాలు తీశాడు! బాలికపై ఎస్సై లైంగిక వేధింపులు
ఎస్సైపై పోక్సో కేసు.. సస్పెన్షన్ వేటు విధాత: కంచె చేను మేసిన చందంగా.. రక్షించాల్సిన వాడే భక్షించాలని చూశాడు. ఫిర్యాదు చేయడానికి వచ్చిన బాలికపై కన్నేశాడు. ఏకంగా పోలీస్‌స్టేషన్‌లోనే లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. పోలీస్‌శాఖ పరువు తీశాడు. అయితే, నిందితుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఈ ఘటన అస్సాం (Assam)లోని ఘోగ్రాపర్ పోలీస్ స్టేషన్ చోటుచేసుకున్నది. అస్సాం డీజీపీ జీపీ సింగ్ కేసు వివరాలను శుక్రవారం మీడియాకు వెల్లడించారు. […]

- ఎస్సైపై పోక్సో కేసు.. సస్పెన్షన్ వేటు
విధాత: కంచె చేను మేసిన చందంగా.. రక్షించాల్సిన వాడే భక్షించాలని చూశాడు. ఫిర్యాదు చేయడానికి వచ్చిన బాలికపై కన్నేశాడు. ఏకంగా పోలీస్‌స్టేషన్‌లోనే లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. పోలీస్‌శాఖ పరువు తీశాడు. అయితే, నిందితుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఈ ఘటన అస్సాం (Assam)లోని ఘోగ్రాపర్ పోలీస్ స్టేషన్ చోటుచేసుకున్నది.
అస్సాం డీజీపీ జీపీ సింగ్ కేసు వివరాలను శుక్రవారం మీడియాకు వెల్లడించారు. అస్సాంలోని నల్బరీ జిల్లాలోని ఓ పోలీస్‌స్టేషన్‌లో జూన్ 21న 17 ఏండ్ల బాలిక ఫిర్యాదు ఇవ్వడానికి రాగా, సబ్ ఇన్‌స్పెక్టర్ బిమన్ రాయ్ లైంగిక వేధింపులకు గురి చేశాడు.
‘అధికారి నన్ను బెదిరించాడు, బట్టలు తొలగించమని బెదిరించాడు. అందుకే నేను భయపడి నా బట్టలు తొలగించాను. ఎస్‌ఐ నా నగ్న చిత్రాన్నితీశారు. అసభ్యకర సంజ్ఞలతో నన్ను వేధించడానికి ప్రయత్నించాడు’ అని బాధితురాలు ఈ నెల 26న ఘోగ్రాపర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
విచారణ జరిపిన పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. జూన్ 21న అస్సాంలోని ఘోగ్రాపర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 17 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు బిమన్ రాయ్ అనే ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్ చేసినట్టు డీజీపీ జీపీ సింగ్ తెలిపారు. నిందితుడు రాయ్ పరారీలో ఉన్నాడని పేర్కొన్నారు. రాయ్ పోలీసు బలగాల పరువును దిగజార్చాడని డీజీపీ తెలిపారు.