Inter Admissions | ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు షెడ్యూలు విడుదల.. అప్లై చేసుకోండిలా..!
Inter Admissions | మీరు పదో తరగతి( Tenth Class ) పాసయ్యారా..? మరి ఆలస్యమెందుకు ఇంటర్ ఫస్టియర్( Inter First Year )లో చేరేందుకు సిద్ధమైపోండి. రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్ కాలేజీల్లో( Junior Colleges ) ప్రవేశాల కోసం ఇంటర్మీడియట్ బోర్డు( Intermediate Board ) షెడ్యూల్‌ను ప్రకటించింది. దరఖాస్తు చేసుకోండి ఇలా..

Inter Admissions | హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్ కాలేజీల్లో( Junior Colleges ) ఇంటర్ ఫస్టియర్( Inter First Year )లో ప్రవేశాలకు ఇంటర్మీడియట్ బోర్డు( Intermediate Board ) బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది. 2025 మే 1వ తేదీ నుంచి తొలి దశ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. మే 1 నుంచి మే 31వ తేదీ వరకు దరఖాస్తులను ఆయా ఇంటర్ కాలేజీల్లో స్వీకరించనున్నారు. జూన్ 2వ తేదీ నుంచి ఇంటర్ ఫస్టియర్ తరగతులు( Inter Classes ) ప్రారంభం కానున్నాయి. జూన్ 30వ తేదీ లోపు తొలి దశ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఇంటర్ ఫస్టియర్‌లో పదో తరగతి( Tenth Class )లో వచ్చిన మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పించనున్నారు.
ఇక ఇంటర్‌లో ప్రవేశం తీసుకోవాలనుకునే విద్యార్థులు ఇంటర్నెట్ మార్క్స్ మెమో( Inter Marks Memo ), ఆధార్ కార్డు( Aadhar Card ) తప్పనిసరిగా దరఖాస్తుకు జతపరచాలి. ప్రొవిజినల్ అడ్మిషన్ పూర్తయిన తర్వాత కచ్చితంగా ఒరిజినల్ మెమోతో పాటు టీసీ( Transfer Certificate ) సమర్పించాల్సి ఉంటుంది. ఇక ఇంటర్‌లో ప్రవేశాల కోసం ఎలాంటి రాత పరీక్ష నిర్వహించకూడదని ఆయా కాలేజీలకు ఇంటర్ బోర్డు హెచ్చరికలు జారీ చేసింది.
ఇంటర్ కాలేజీల్లో ఎస్సీలకు 15 శాతం రిజర్వేషన్లు, ఎస్టీలకు 10 శాతం, బీసీలకు 29 శాతం, పీహెచ్ అభ్యర్థులకు 5 శాతం, ఎన్‌సీసీ, స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు 5 శాతం, ఎక్స్ సర్వీస్‌మెన్ అండ్ డిఫెన్స్ పర్సనల్స్‌కు 3 శాతం, ఈడబ్ల్యూఎస్ కోటా కింద 10 శాతం రిజర్వేషన్లు వర్తింపజేయనున్నారు.