ఆధునిక భారత్‌ను ఆవిష్కరిస్తున్నాం: మోడీ

విధాత: విశాఖలో ప్రధాని నరేంద్రమోడీ పర్యటిస్తున్నారు. ఏపీలో పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. ఏయూ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. మౌలిక సదుపాయాలతో ఆధునిక భారత్‌ను ఆవిష్కరిస్తున్నాం. రోడ్లు, పోర్టుల అభివృద్ధిలో మేం ఎప్పుడూ సందేహించలేదన్నారు. విశాఖ రైల్వే స్టేషన్‌తో పాటు పోర్టును ఆధునీకరిస్తున్నామని,మిషన్‌ గతిశక్తి కింద ప్రాజెక్టుల్లో వేగం పెంచామని తెలిపారు. ఇవాళ ప్రతి దేశం ఏదో ఒక సంక్షోభాన్నిఎదుర్కొంటున్నది. సంక్షోభంలో ఉన్న ప్రతి దేశం నేడు భారత్‌వైపు చూస్తున్నదని, […]

  • By: krs    latest    Nov 12, 2022 7:47 AM IST
ఆధునిక భారత్‌ను ఆవిష్కరిస్తున్నాం: మోడీ

విధాత: విశాఖలో ప్రధాని నరేంద్రమోడీ పర్యటిస్తున్నారు. ఏపీలో పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. ఏయూ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. మౌలిక సదుపాయాలతో ఆధునిక భారత్‌ను ఆవిష్కరిస్తున్నాం.

రోడ్లు, పోర్టుల అభివృద్ధిలో మేం ఎప్పుడూ సందేహించలేదన్నారు. విశాఖ రైల్వే స్టేషన్‌తో పాటు పోర్టును ఆధునీకరిస్తున్నామని,మిషన్‌ గతిశక్తి కింద ప్రాజెక్టుల్లో వేగం పెంచామని తెలిపారు. ఇవాళ ప్రతి దేశం ఏదో ఒక సంక్షోభాన్నిఎదుర్కొంటున్నది. సంక్షోభంలో ఉన్న ప్రతి దేశం నేడు భారత్‌వైపు చూస్తున్నదని, సామాన్యుల ఆకాంక్షలు నెరవేర్చడమే ఈ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.

పీఎం కిసాన్‌ ద్వారా రైతుల ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేస్తున్నామని ప్రధాని పేర్కొన్నారు. మత్స్యకారులకు కూడా కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు ఉపయోగపడుతున్నాయని, పేదవాళ్ల జీవితాలు మారితేనే వికాస్‌ భారత్‌కు అసలైన అర్థం అని ప్రధాని అన్నారు. ప్రాజెక్టుల శంకుస్థాపనలో కార్యక్రమంలో ఏపీ సీఎం జగన్‌, గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, కేంద్రమంత్రి అశ్వనీకుమార్‌ పాల్గొన్నారు.

అంతర్జాతీయ స్థాయిలో విశాఖ రైల్వే స్టేషన్‌

కేంద్ర మంత్రి అశ్వినీవైష్ణవ్‌ మాట్లాడుతూ.. ప్రధాని మోడీ నాయకత్వంలో రూ. 446 కోట్లతో విశాఖ రైల్వే స్టేషన్‌ను అంతర్జాతీయ స్థాయిలో ఆధునీకరించనున్నామన్నారు. చాలా చక్కని డిజైన్‌ రూపొందించాం. టెండర్ల ప్రక్రియ పూర్తయ్యింది. నిర్మాణపనులు మొదలయ్యాయన్నారు. వేగవంతంగా రైల్వే స్టేషన్‌ పనులు పూర్తి చేస్తామన్నారు.

అంతర్జాతీయ స్థాయి రైలు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రూపకల్పనకు ప్రధాని మోడీ స్ఫూర్తిగా నిలిచారని, అతిత్వరలోనే ఆంధ్రప్రదేశ్‌కు వందేభారత్‌ రైలు కేటాయిస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు రికార్డు స్థాయిలో నిధులు కేటాయించామన్నారు. 2014కు ముందు ఉమ్మడి ఏపీకి కేవలం రూ.886 కోట్లు మాత్రమే కేటాయించే వారని. ఇప్పుడు ఒక నవ్యాంధ్రకే రూ. 7.032 కోట్లు ప్రధాని ఇచ్చారన్నారు.

కొత్త రైల్వే లైన్లు, డబ్లింగ్‌ పనులు, గేజ్‌ల మార్పు వంటి పనుల్లో ఇది ప్రతిబింబిస్తున్నదన్నారు. 4,668 గ్రామాలను టెలికాం టవర్లతో అనుసంధానిస్తున్నాని తెలిపారు. దీని వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని మారుమూల గ్రామాలకూ అంతర్జాతీయ స్థాయి మొబైల్‌ కనెక్టివిటీ లభించనున్నదన్నారు.