సీఎం కార్య‌ద‌ర్శిగా ఐపీఎస్ అధికారి షాన‌వాజ్ ఖాసిం

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కార్య‌ద‌ర్శిగా ఐపీఎస్ అధికారి షాన‌వాజ్ ఖాసిం నియ‌మితుల‌య్యారు. ఈ మేర‌కు ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది

  • By: Somu    latest    Dec 12, 2023 10:00 AM IST
సీఎం కార్య‌ద‌ర్శిగా ఐపీఎస్ అధికారి షాన‌వాజ్ ఖాసిం

హైద‌రాబాద్ : తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కార్య‌ద‌ర్శిగా ఐపీఎస్ అధికారి షాన‌వాజ్ ఖాసిం నియ‌మితుల‌య్యారు. ఈ మేర‌కు ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. 2003 బ్యాచ్‌కు చెందిన షాన‌వాజ్ ఖాసిం.. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ రేంజ్ ఐజీగా ఖాసిం కొన‌సాగుతున్నారు.


తెలంగాణలో ఐదుగురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసిన సంగ‌తి తెలిసిందే. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డికి పోస్టింగ్‌ ఇచ్చింది. రాచకొండ పోలీస్‌ కమిషనర్‌గా సుధీర్‌బాబును, సైబరాబాద్‌ సీపీగా అవినాష్‌ మహంతిని నియమించింది.


ఇప్పటివరకు హైదరాబాద్‌ సీపీగా ఉన్న సందీప్‌ శాండిల్య యాంటీ నార్కొటిక్‌ వింగ్‌ డైరెక్టర్‌గా బదిలీ చేసింది. రాచకొండ సీపీ చౌహాన్‌, సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్రలను డీజీపీ ఆఫీస్‌కు అటాచ్‌ చేసింది.