IRCTC Kedarnath Badrinath Tour Package | బద్రీనాథ్‌, కేదార్‌నాథ్‌ దర్శించుకునేందుకు ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ..! విమానంలోనే ప్రయాణం..!

IRCTC Kedarnath Badrinath Tour Package | హిందువులకు చార్‌ధామ్‌ యాత్ర ఎంతో పవిత్రమైంది. ఏటా ఎంతో మంది భక్తులు గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్‌, కేదార్‌నాథ్‌లను సందర్శిస్తుంటారు. ఈ క్రమంలోనే యాత్రకు వెళ్లేవారి కోసం ఐఆర్‌సీటీసీ సరికొత్త ప్యాకేజీని తీసుకువచ్చింది. ఈ ప్యాకేజీలను బద్రీనాథ్‌, కేదార్‌నాథ్‌లను సందర్శించుకునేందుకు భాగ్యం కలుగనున్నది. అయితే, ఈ ప్యాకేజీలో కేవలం రెండు క్షేత్రాలను మాత్రమే వీక్షించే అవకాశం ఉంది. ఐఆర్‌సీటీసీ దో ధామ్‌ ఎక్స్‌ కోల్‌కతా (DO DHAM EX KOLKATA […]

IRCTC Kedarnath Badrinath Tour Package | బద్రీనాథ్‌, కేదార్‌నాథ్‌ దర్శించుకునేందుకు ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ..! విమానంలోనే ప్రయాణం..!

IRCTC Kedarnath Badrinath Tour Package |

హిందువులకు చార్‌ధామ్‌ యాత్ర ఎంతో పవిత్రమైంది. ఏటా ఎంతో మంది భక్తులు గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్‌, కేదార్‌నాథ్‌లను సందర్శిస్తుంటారు. ఈ క్రమంలోనే యాత్రకు వెళ్లేవారి కోసం ఐఆర్‌సీటీసీ సరికొత్త ప్యాకేజీని తీసుకువచ్చింది.

ఈ ప్యాకేజీలను బద్రీనాథ్‌, కేదార్‌నాథ్‌లను సందర్శించుకునేందుకు భాగ్యం కలుగనున్నది. అయితే, ఈ ప్యాకేజీలో కేవలం రెండు క్షేత్రాలను మాత్రమే వీక్షించే అవకాశం ఉంది.

ఐఆర్‌సీటీసీ దో ధామ్‌ ఎక్స్‌ కోల్‌కతా (DO DHAM EX KOLKATA -EHA065) పేరుతో ప్యాకేజీని తీసుకువచ్చింది. ఈ ప్యాకేజీ కోల్‌కతా నుంచి ప్రారంభంకానున్నది.

కేవలం ఫ్లైట్‌ టూర్‌ ప్యాకేజీ. ప్రయాణం మొత్తం విమానంలోనే సాగుతుంది. భోజనం, బస, ప్రయాణ తదితర ఏర్పాట్లన్నీ ఐఆర్‌సీటీ చూసుకుంటుంది. ప్యాకేజీలో కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌, గుప్తకాశీ, రుద్రప్రయాగ్‌లను సందర్శించేందుకు వీలుంటుంది.

ప్యాకేజీలో ఒక్కో వ్యక్తి రూ.69,100 చెల్లించాల్సి ఉంటుంది. ఇద్దరు కలిసి బుక్‌ చేసుకుంటే రూ.48,400.. ముగ్గురు కలిసి బుక్‌ చేస్తే రూ.46,300 ఒక్కొక్కరు చెల్లించాల్సి ఉంటుంది.