అల్లు అరవింద్-దిల్ రాజుల మధ్య చిచ్చు పెట్టిన ‘గీత గోవిందం 2’
విధాత: ఏ రంగంలో అయినా ఆధిపత్య పోరు అనేది ఉంటుంది. అలాంటి ఆధిపత్య పోరు ప్రస్తుతం టాలీవుడ్ నిర్మాతల్లో కనిపిస్తోంది. కొన్ని సందర్భాలలో అది పెద్ద దుమారానికి తెర తీస్తోంది. టాలీవుడ్‌లో బడా స్టార్ ప్రొడ్యూసర్స్ అయిన ఇద్దరి మధ్య ఆదిపత్య పోరు మొదలైందని అంటున్నారు. ఒక నిర్మాత అసహనంగా ఉండగా మరో నిర్మాత పక్క వారిని కూల్ చేయడానికి పావులు కదుపుతున్నాడు. సినిమాల రిలీజుల విషయంలో ఒకరికి ఒకరు పోటీగా నిలబడకూడదన్నది గత కొంతకాలంగా టాలీవుడ్ […]

విధాత: ఏ రంగంలో అయినా ఆధిపత్య పోరు అనేది ఉంటుంది. అలాంటి ఆధిపత్య పోరు ప్రస్తుతం టాలీవుడ్ నిర్మాతల్లో కనిపిస్తోంది. కొన్ని సందర్భాలలో అది పెద్ద దుమారానికి తెర తీస్తోంది. టాలీవుడ్‌లో బడా స్టార్ ప్రొడ్యూసర్స్ అయిన ఇద్దరి మధ్య ఆదిపత్య పోరు మొదలైందని అంటున్నారు.
ఒక నిర్మాత అసహనంగా ఉండగా మరో నిర్మాత పక్క వారిని కూల్ చేయడానికి పావులు కదుపుతున్నాడు. సినిమాల రిలీజుల విషయంలో ఒకరికి ఒకరు పోటీగా నిలబడకూడదన్నది గత కొంతకాలంగా టాలీవుడ్ నిర్మాతలలో మాత్రం వినిపిస్తూ వస్తోంది.
కొంతమంది చెప్పిన మాట ప్రకారం పోటీ నుంచి తప్పుకుంటూ రిలీజ్ డేట్లను మార్చుకుంటున్నారు. అయితే తాజాగా దిల్ రాజు తన రెండు చిత్రాలను విడుదల చేయాలని భావించారు. ఆ ఇద్దరూ ఎవరో కాదు అల్లు అరవింద్- దిల్ రాజు.
అల్లు అరవింద్ సమర్పణలో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించే లేటెస్ట్ మూవీ వినరో భాగ్యము విష్ణు కథ బన్నీ వాసు దీన్ని నిర్మించాడు. ఫిబ్రవరి 17న విడుదల చేస్తున్నారు. ఇదే సమయంలో మరో రెండు క్రేజీ ప్రాజెక్టు కూడా పోటీగా విడుదల కానున్నాయి.
సమంత టైటిల్ రోలు పాత్రలో గుణశేఖర్ రూపొందించిన శాకుంతలం విడుదల కానుంది. ఈ సినిమాను దిల్ రాజు విడుదల చేస్తున్నాడు. అదే రోజున విశ్వక్సేన్ నటించిన దాస్ కీ ధమ్కీ విడుదల కానుంది. ఇప్పుడు అదే అల్లు అరవింద్ దిల్ రాజుల మధ్య దూరాన్ని పెంచింది.
ఈ విషయంలో ప్రత్యేకంగా అల్లు అరవింద్ ప్రెస్మీట్ కూడా పెట్టాలని అనుకున్నారు. అయితే విషయం తెలుసుకున్న దిల్ రాజు శాకుంతలన్నీ పోస్ట్ పోన్ చేయడమే కాకుండా విశ్వక్‌సేన్ నటించిన దాస్‌కి ధమ్కీ రిలీజును కూడా వాయిదా వేయించారని వార్తలు వినిపిస్తున్నాయి.
అల్లు అరవింద్‌ను కూల్ చేయడానికి ఈ రెండు సినిమాలను దిల్ రాజు వాయిదా వేయించాడని ఇన్సైడ్ టాక్. ఈ రెండు సినిమాలతో పాటు తాను చేయాలనుకున్న గీతగోవిందం సీక్వెల్‌ని దిల్ రాజు ఆక్రమించడంపై కూడా అల్లు అరవింద్ అసహనంగా ఉన్నాడు.
వాస్తవానికి గీత ఆర్ట్స్ 2 బ్యానర్‌లోనే గీతాగోవిందం సీక్వెల్ రూపొందాల్సి ఉంది. కానీ ఆ చిత్రాన్ని ప్రస్తుతం దిల్ రాజు చేస్తున్నాడు. స్టోరీ అదేనా కాదా అనే విషయాన్ని పక్కన పెడితే విజయ్ దేవరకొండ పరుశురాం కాంబినేషన్‌ని దిల్ రాజు పట్టేశాడు. దాంతో ఇది గీతగోవిందం సీక్వెల్‌కు ఆటంకం కలిగిస్తోందని అల్లు అరవింద్ గుర్రు మీద ఉన్నాడు. మరి ఈ విషయంలో అల్లు వారిని శాంత పరిచేందుకు దిల్ రాజు మరెన్ని తంటాలు పడతాడో వేచి చూడాలి..!