ISRO | గగనయానానికి భారత్‌ అడుగులు

ISRO ప్రొపల్షన్‌ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించిన ఇస్రో వీటి ఆధారంగా మరింత ఆధునీకరణ చెన్నై: గగనయానానికి ఏర్పాట్లలో ఇస్రో ఉన్నది. అంతరిక్షంలోకి మొట్టమొదటిసారిగా భారతీయులను పంపనున్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు సంబంధించి బుధవారం రెండు కీలక పరీక్షలు నిర్వహించింది. గగన్‌యాన్‌ ప్రొపల్షన్‌ సిస్టమ్‌లో చేయాల్సిన మార్పులు, ఆధునీకరణను అంచనా వేసేందుకు చేసిన ఈ రెండు పరీక్షలు విజయవంతమయ్యాయి. వీటిని తమిళనాడులోని మహేంద్రగిరి వద్ద ఉన్న ఇస్రో ప్రొపల్షన్‌ కాంప్లెక్స్‌లో పరీక్షించారు. అంతరిక్షంలోకి ముగ్గరు భారతీయులను పంపేందుకు ఉద్దేశించినదే గగన్‌యాన్‌ […]

ISRO | గగనయానానికి భారత్‌ అడుగులు

ISRO

  • ప్రొపల్షన్‌ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించిన ఇస్రో
  • వీటి ఆధారంగా మరింత ఆధునీకరణ

చెన్నై: గగనయానానికి ఏర్పాట్లలో ఇస్రో ఉన్నది. అంతరిక్షంలోకి మొట్టమొదటిసారిగా భారతీయులను పంపనున్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు సంబంధించి బుధవారం రెండు కీలక పరీక్షలు నిర్వహించింది. గగన్‌యాన్‌ ప్రొపల్షన్‌ సిస్టమ్‌లో చేయాల్సిన మార్పులు, ఆధునీకరణను అంచనా వేసేందుకు చేసిన ఈ రెండు పరీక్షలు విజయవంతమయ్యాయి.

వీటిని తమిళనాడులోని మహేంద్రగిరి వద్ద ఉన్న ఇస్రో ప్రొపల్షన్‌ కాంప్లెక్స్‌లో పరీక్షించారు. అంతరిక్షంలోకి ముగ్గరు భారతీయులను పంపేందుకు ఉద్దేశించినదే గగన్‌యాన్‌ ప్రాజెక్టు. 400 కిలోమీటర్ల ఎత్తున అంతరిక్షంలో భారత వ్యోమగాములు మూడు రోజులపాటు గడపనున్నారు.

భారత సముద్ర జలాల్లో దిగడం ద్వారా సురక్షితంగా భారత్‌ చేరుకుంటారు. ఈ ప్రాజెక్టు విషయంలో మరో మూడు కీలక పరీక్షలు నిర్వహించాల్సి ఉన్నదని ఇస్రో తెలిపింది.