ISRO | రేపు ఇస్రో PSLV – C55 రాకెట్ ప్రయోగం

విధాత‌: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ఈ నెల 22వ తేదీన మరో వాణిజ్జ ప్రయోగానికి రంగం సిద్ధం చేసింది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్‌లోని మొదటి ప్రయోగ వేదికపై నుండి శనివారం మధ్యాహ్నం 2 గంటల 19 నిమిషాలకు ఇస్రో PSLV -C55 రాకెట్ ద్వారా సింగపూర్‌కు చెందిన టెల్ ఇయోస్ -2 ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నది. #PSLV-C55 to be launched on 22nd April at 14:19 […]

ISRO | రేపు ఇస్రో PSLV – C55 రాకెట్ ప్రయోగం

విధాత‌: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ఈ నెల 22వ తేదీన మరో వాణిజ్జ ప్రయోగానికి రంగం సిద్ధం చేసింది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్‌లోని మొదటి ప్రయోగ వేదికపై నుండి శనివారం మధ్యాహ్నం 2 గంటల 19 నిమిషాలకు ఇస్రో PSLV -C55 రాకెట్ ద్వారా సింగపూర్‌కు చెందిన టెల్ ఇయోస్ -2 ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నది.

741 కిలోల బరువు కలిగిన సింగపూర్ ఉపగ్రహం తో పాటు 16 కిలోల లుమొలైట్ అనే ఉపగ్రహాన్ని కూడా ప్రయోగించడానికి సర్వం సిద్ధం చేసింది. ఈ ప్రయోగానికి సంబందించిన కౌంట్ డౌన్ కూడా ప్రయోగానికి 25 :30 గంటల ముందు నుండి ప్రారంభించాలని శాస్త్రవేత్తలు నిర్ణయించారు. ఒక రాకెట్ ప్రయోగాన్ని విజయవంతం చేసి నెల రోజులు పూర్తి కాకముందే మరో రాకెట్ ప్రయోగానికి ఇస్రో సిద్ధం చేసి ప్రయోగించడం మరో రికార్డును సొంతం చేసుకోబోతుంది.