IT RIDES | ఈ టైమ్‌లో.. సుకుమార్, మైత్రీ ఆఫీసులపై IT దాడులెందుకు?
IT RIDES విధాత: టాలీవుడ్‌కి చెందిన అగ్రగామి సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, అలాగే ఆ సంస్థతో మంచి అనుబంధం ఉన్న క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ ఆఫీస్‌లపై బుధవారం ఐటీ(IT) దాడులు జరిగాయి. ప్రస్తుతం మైత్రీ నుంచి ఏ సినిమా విడుదలకు సిద్ధంగా లేదు. అయినా కూడా ఎందుకు దాడులు జరిగాయనే దానిపై ఇంత వరకు క్లారిటీ రాలేదు. అంతకుముందు, ఏ టాప్ బ్యానర్ నుంచి సినిమా విడుదల అవుతున్నా.. ఆ బ్యానర్ ఆఫీస్‌లపై ఐటీ దాడులు […]

IT RIDES
విధాత: టాలీవుడ్‌కి చెందిన అగ్రగామి సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, అలాగే ఆ సంస్థతో మంచి అనుబంధం ఉన్న క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ ఆఫీస్‌లపై బుధవారం ఐటీ(IT) దాడులు జరిగాయి. ప్రస్తుతం మైత్రీ నుంచి ఏ సినిమా విడుదలకు సిద్ధంగా లేదు. అయినా కూడా ఎందుకు దాడులు జరిగాయనే దానిపై ఇంత వరకు క్లారిటీ రాలేదు. అంతకుముందు, ఏ టాప్ బ్యానర్ నుంచి సినిమా విడుదల అవుతున్నా.. ఆ బ్యానర్ ఆఫీస్‌లపై ఐటీ దాడులు సహజంగానే జరుగుతుండేవి. కానీ ఈసారి ఐటీ(IT) అధికారులు సరికొత్తగా ప్లాన్ చేశారు.
ఇక మైత్రీ మూవీ మేకర్స్ విషయానికి వస్తే.. సంక్రాంతికి ఈ బ్యానర్‌లో రెండు సినిమాలు, స్టార్ హీరోలు నటించినవి విడుదల అయ్యాయి. అందులో ఒకటి మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ కాగా.. రెండోది బాలయ్య నటించిన ‘వీరసింహారెడ్డి’. ఈ రెండు సినిమాల విడుదలకు ముందు మైత్రీ ఆఫీస్‌లపై ఐటీ దాడులు జరిగాయని, జీఎస్టీకి సంబంధించి కొన్ని కీలక పత్రాలు లభించాయనే వార్తలు వచ్చాయి. మళ్లీ 3 నెలలు గడవక ముందే మరోసారి ఆ ఆఫీస్‌పై IT దాడులు జరగడంతో ఒక్కసారిగా టాలీవుడ్ షాక్‌కు గురైంది.
ఇక మైత్రీ మూవీ మేకర్స్ మాత్రమే కాదు.. డైరెక్టర్ సుకుమార్ ఆఫీస్‌లపై కూడా దాడులు జరిగాయి. ప్రస్తుతం సుకుమార్ దర్శకుడిగానే కాకుండా నిర్మాతగానూ మారి సినిమాలు నిర్మిస్తున్నారు. ఆయన నిర్మాణ భాగస్వామ్యం వహించిన ‘విరూపాక్ష’ చిత్రం ఈ శుక్రవారం విడుదల కాబోతోంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కాబోతుండటంతో పాటు.. ఆయన దర్శకత్వం వహిస్తున్న ‘పుష్ప ది రూల్’ సినిమా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లోనే రూపుదిద్దుకుంటోంది.
ఈ సినిమాకు సంబంధించి ఈ మధ్య రూ.1000 కోట్ల బిజినెస్ అంటూ కొన్ని లెక్కలు వినిపించాయి. నెంబర్ టెంప్టింగ్‌గా ఉండటంతో.. ఐటీ(IT) అధికారులు ఏదో జరుగుతుందని భావించి కూడా సోదాలు చేసి ఉండవచ్చనేలా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. ‘పుష్ప’ మాత్రమే కాకుండా.. మైత్రీ మూవీ మేకర్స్‌లో ప్రస్తుతం ‘ఖుషి’, ‘ఉస్తాద్ భగత్‌సింగ్’, కల్యాణ్ రామ్‌తో మరో సినిమా ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉన్నాయి.
ఇవి కాకుండా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబో ఫిల్మ్, రామ్ చరణ్-బుచ్చిబాబు ఫిల్మ్ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉన్నాయి. నిర్మాణమే కాకుండా.. మైత్రీ సంస్థ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి కూడా అడుగుపెట్టింది. వీటన్నింటిపై ఒక కన్నేసి ఉంచిన ఐటీ(IT) అధికారులు సడెన్‌గా ఇలా సోదాలు నిర్వహించారు. మరి ఈ సోదాల్లో ఏమేం లభించాయనేది మాత్రం ఇంకా తెలియరాలేదు.