Sri Chaitanya Colleges: శ్రీ చైతన్య కాలేజీలపై ఐటీ సోదాలు!
శ్రీ చైతన్య కాలేజీలపై ఆంధ్ర, తెలంగాణతో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై సహా 30ప్రాంతాల్లో ఐటీ బృందాలు సోదాలు చేపట్టాయి. హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న శ్రీ చైతన్య విద్యాసంస్థలు పెద్ద మొత్తంలో అక్రమ లావాదేవీలు నిర్వహిస్తున్నట్లుగా ఐటీ అధికారులు గుర్తించారు.

Sri Chaitanya Colleges: దేశవ్యాప్తంగా శ్రీ చైతన్య కాలేజీలపై ఐటీ సోదాలు కొనసాగిస్తుండటం సంచలనంగా మారింది. ఆంధ్ర, తెలంగాణతో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై సహా 30ప్రాంతాల్లో ఐటీ బృందాలు సోదాలు చేపట్టాయి. హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న శ్రీ చైతన్య విద్యాసంస్థలు
పెద్ద మొత్తంలో అక్రమ లావాదేవీలు నిర్వహిస్తున్నట్లుగా గుర్తించారు. విద్యార్థుల నుంచి నగదు రూపంలో డబ్బులు తీసుకొని టాక్స్ చెల్లించకుండా ఎగవేతకు పాల్పడ్డారని..విద్యార్థుల కొరకు ప్రత్యేకంగా సాఫ్ట్ వేర్ తయారు చేసుకొని లావాదేవీలు నిర్వహించారని తేలింది. ప్రభుత్వానికి కట్టే టాక్స్ కొరకు మరొక సాఫ్ట్ వేర్ ను శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఏర్పాటు చేసుకున్నారని గుర్తించారు.
మాదాపూర్ లోని శ్రీ చైతన్య కాలేజ్ హెడ్ క్వార్టర్స్ లో సోదాలు చేపట్టారు. ఒక్క కార్పోరేట్ ఆఫీసులోనే 2కోట్లకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు. పేపర్ కాటన్ లో భారీగా నగదు గుర్తించారు. పక్కనే ఉన్న సంస్థ ఆఫీసుల్లో మరింత భారీగా నగదు ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. ఐటీ బృందాలు ముమ్మరంగా సోదాలు కొనసాగిస్తున్నాయి.