యాదగిరిగుట్ట బస్ స్టేషన్ ను ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి

విధాత: యాదగిరిగుట్టలో 6 కోట్లతో నూతనంగా నిర్మించిన ఆర్టీసీ బస్ స్టేషన్ ను మంత్రి జగదీష్ రెడ్డి బుధవారం ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేపట్టిన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం అభివృద్ధిలో భాగంగా నూతన బస్ స్టేషన్ ప్రారంభించడం సంతోషకరమన్నారు. యాదాద్రి కి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా నూతన […]

యాదగిరిగుట్ట బస్ స్టేషన్ ను ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి

విధాత: యాదగిరిగుట్టలో 6 కోట్లతో నూతనంగా నిర్మించిన ఆర్టీసీ బస్ స్టేషన్ ను మంత్రి జగదీష్ రెడ్డి బుధవారం ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేపట్టిన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం అభివృద్ధిలో భాగంగా నూతన బస్ స్టేషన్ ప్రారంభించడం సంతోషకరమన్నారు.

యాదాద్రి కి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా నూతన బస్ స్టేషన్ ను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.