హరీశ్‌రావు బ్లాక్ మనీ ఎక్కడ దాచారో జగ్గారెడ్డికి తెలుసట!
మాజీ మంత్రి హరీష్ రావు కూడబెట్టుకున్న బ్లాక్ మనీ ఎక్కడ దాచారో త్వరలోనే సీఎంకు రేవంత్ రెడ్డి చెప్తానని కాంగ్రెస్ సీనియర్ నేత టి.జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు

25మంది బీఆరెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరడం ఖాయం
కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు
విధాత : బీఆరెస్ మాజీ మంత్రి హరీష్ రావు కూడబెట్టుకున్న బ్లాక్ మనీ ఎక్కడ దాచారో త్వరలోనే సీఎంకు రేవంత్ రెడ్డి చెప్తానని కాంగ్రెస్ సీనియర్ నేత టి.జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తన వద్ధ డబ్బు లేకపోవడంతో ఓటమి చెందానని, అదిగాక బీఆరెస్ పార్టీ ఎన్నికల్లో కాంగ్రెస్‌లోని కొందరు నేతలను టార్గెట్ చేసి ఓడించే ప్రయత్నం చేసిందని అందుకే తాను కూడా ఓడిపోయానన్నారు. హరీశ్‌రావు తన మామ కేసీఆర్‌ను ఎప్పుడైనా వెన్నుపోటు పొడుస్తారన్నారు. గతంలో పోలీసులను అడ్డు పెట్టుకుని బీఆరెస్ నేతలు తమను గడ్డపారతో పొడిచినంత పని చేశారని ఆరోపించారు. తొమ్మిదేళ్లలో బీఆరెస్ పార్టీ తమను ఎన్నో ఇబ్బందులకు గురి చేసిందని అన్నారు. ప్రస్తుతం బీఆరెస్ పరిస్థితి చూసి సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఆలోచనలో పడ్డారని, త్వరలోనే 25 మంది బీఆరెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరబోతున్నారన్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డి ఎప్పుడైనా తమ పార్టీలో చేరవచ్చన్నారు. తాను మెదక్ ఎంపీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకోలేదని అన్నారు. ఒక వేళ రేవంత్ రెడ్డి అద్దేశిస్తే తాను పాటికి సిద్దమన్నారు.