Jana Reddy | కర్ణాటక తరహాలో తెలంగాణలో.. కాంగ్రెస్‌కి ప్రజలు పట్టం కడతారు: మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి
Jana Reddy | విధాత: కర్ణాటక తరహాలోనే తెలంగాణలో కూడా రాబోయే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ కి పట్టం కడతారని మాజీ సీఎల్పీ నేత కుందూరుజానారెడ్డి అన్నారు. శనివారం సాగర్ లో నిడమనూరు మండలం శాఖ పురం మాజీ సర్పంచ్ మాజీ ఎంపీపీ(గతంలో జానా రెడ్డి కుడి భుజం) చేకూరి హనుమంతరావు కుమారుడు చేకూరి వంశీ చరణ్ ఆధ్వర్యంలో పలువురు బీఆర్ ఎస్ నుండి జానా రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జానా […]

Jana Reddy |
విధాత: కర్ణాటక తరహాలోనే తెలంగాణలో కూడా రాబోయే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ కి పట్టం కడతారని మాజీ సీఎల్పీ నేత కుందూరుజానారెడ్డి అన్నారు. శనివారం సాగర్ లో నిడమనూరు మండలం శాఖ పురం మాజీ సర్పంచ్ మాజీ ఎంపీపీ(గతంలో జానా రెడ్డి కుడి భుజం) చేకూరి హనుమంతరావు కుమారుడు చేకూరి వంశీ చరణ్ ఆధ్వర్యంలో పలువురు బీఆర్ ఎస్ నుండి జానా రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా జానా రెడ్డి మాట్లాడుతూ కర్ణాటక ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తరుపున ధన్యవాదాలు తెలియజేశారు . తెలంగాణ లో బీ ఆర్ ఎస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ, పేదలకు మూడు ఎకరాల భూమి పంపిణీ, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడంలో విఫలం అయ్యారని ఆరోపించారు.
రైతురుణమాఫీ లక్ష రూపాయలు మాఫీ అయ్యే లోపు ఆ రుణం రెండింతలు అయిందని దీనితో బ్యాంకులు రైతులని చెల్లించాలి అని వత్తిడి తెస్తున్నారు అని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తామని, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని వెల్లడించారు.
కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో కోల శ్యామ్, రషీద్,జానకిరామ్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో నందికొండ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తుమ్మలపల్లి రంగారెడ్డి తదితరులు ఉన్నారు.