Pawan Kalyan | జనసేన మళ్లీ సైలెంట్.. పవన్ వ్యూహం ఏమిటో.!

Pawan Kalyan | విధాత‌: ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది.. చంద్రబాబు ..జగన్ తమ వ్యూహాలకు పదును పెట్టి విజయానికి వ్యూహాలు పన్నుతున్నారు. రాష్ట్రంలో పెద్దగా బలం లేని బీజేపీ.. లెఫ్ట్ పార్టీలు సైతం అప్పుడప్పుడూ అస్తిత్వం కోసం ప్రయత్నిస్తున్నాయి. కానీ రాష్ట్ర రాజకీయాలు మారుస్తాను అని చెప్పే పవన్ కళ్యాణ్ మాత్రం ఎక్కడా కనిపించడం లేదు.. వారాహి పేరిట భారీగా వాహనాన్ని రెడీ చేసిన పవన్ దాన్ని పూజ చేసి మూలన పెట్టేసారు. ఇటు రాష్ట్రంలో […]

  • By: Somu    latest    Mar 30, 2023 10:39 AM IST
Pawan Kalyan | జనసేన మళ్లీ సైలెంట్.. పవన్ వ్యూహం ఏమిటో.!

Pawan Kalyan |

విధాత‌: ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది.. చంద్రబాబు ..జగన్ తమ వ్యూహాలకు పదును పెట్టి విజయానికి వ్యూహాలు పన్నుతున్నారు. రాష్ట్రంలో పెద్దగా బలం లేని బీజేపీ.. లెఫ్ట్ పార్టీలు సైతం అప్పుడప్పుడూ అస్తిత్వం కోసం ప్రయత్నిస్తున్నాయి.

కానీ రాష్ట్ర రాజకీయాలు మారుస్తాను అని చెప్పే పవన్ కళ్యాణ్ మాత్రం ఎక్కడా కనిపించడం లేదు.. వారాహి పేరిట భారీగా వాహనాన్ని రెడీ చేసిన పవన్ దాన్ని పూజ చేసి మూలన పెట్టేసారు. ఇటు రాష్ట్రంలో ఆయన ఆలోచన ఏమిటంటూ అభిమానులు అయోమయంలో ఉన్నారు.

నెల రోజుల కిందట మంగళగిరిలో బీసీల సంక్షేమం.. కాపు సంక్షేమం పేరుతో సభలు నిర్వహించి.. కొన్ని దిశానిర్దేశాలు చేసిన పవన్.. ఇప్పుడు మళ్లీ పత్తా లేకుండా పోయారు. ఇది పార్టీలోనే కాకుండా… ప్రజల మధ్య కూడా చర్చకు దారితీస్తోంది.

అసలు పవన్ ఉద్దేశం ఏంటనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. నిజానికి గత నెలలో సభలు పెట్టిన తర్వాత.. కాపులు చైతన్యం కావాలని దిశానిర్దేశం చేసిన తర్వాత.. కొంత చైతన్యం కనిపించింది. కాపులు కూడా ఆలోచనలో పడ్డారు. వారిలో తప్పులు సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు.

కానీ ఇంతలోనే మళ్లీ పవన్ వారి ఉత్సాహం మీద నీళ్లు చెల్లెసారు. టీడీపీతో పొత్తు..సీట్ల పంపిణీ వంటివాటిమీద క్లారిటీ వస్తే తప్ప పవన్ మళ్ళీ జనాల్లోకి వచ్చేలా లేరని అంటున్నారు.