River | ఎరుపు రంగులోకి మారిపోయిన న‌ది.. ఫోటోలు వైర‌ల్

River | ఓ న‌ది ఉన్న‌ట్టుండి ముదురు ఎరుపు రంగులోకి మారిపోయింది. ఆ న‌ది ప్ర‌వాహం ర‌క్తం రంగులోకి మార‌డంతో స్థానికులు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. జ‌పాన్‌లోని నాగో సిటీలోని ఓ న‌ది ఎరుపు రంగులోకి మారిన దృశ్యాలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. అయితే న‌ది ముదురు ఎరుపు రంగులోకి మార‌డానికి కార‌ణం.. ఒరియాన్ బీర్ ఫ్యాక్ట‌రీకి చెందిన కూలింగ్ వ్య‌వ‌స్థ‌ల్లో ఒక దానిలో ఏర్ప‌డిన లీకేజీయే అని తేలింది. ఆహార ప‌దార్థాల్లో ఉప‌యోగించే […]

River | ఎరుపు రంగులోకి మారిపోయిన న‌ది.. ఫోటోలు వైర‌ల్

River | ఓ న‌ది ఉన్న‌ట్టుండి ముదురు ఎరుపు రంగులోకి మారిపోయింది. ఆ న‌ది ప్ర‌వాహం ర‌క్తం రంగులోకి మార‌డంతో స్థానికులు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. జ‌పాన్‌లోని నాగో సిటీలోని ఓ న‌ది ఎరుపు రంగులోకి మారిన దృశ్యాలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

అయితే న‌ది ముదురు ఎరుపు రంగులోకి మార‌డానికి కార‌ణం.. ఒరియాన్ బీర్ ఫ్యాక్ట‌రీకి చెందిన కూలింగ్ వ్య‌వ‌స్థ‌ల్లో ఒక దానిలో ఏర్ప‌డిన లీకేజీయే అని తేలింది. ఆహార ప‌దార్థాల్లో ఉప‌యోగించే ప్రొపిలిన్ గ్లైకాన్ అనే ర‌సాయ‌న ద్రావ‌ణం పొర‌పాటున లీకైంది. ఆ ద్రావ‌ణం న‌దిలోకి విడుద‌ల కావ‌డంతో.. నీరంతా ర‌క్తం మాదిరిగా ముదురు ఎరుపు రంగులోకి మారిపోయింది. దీంతో ఒరియాన్ బీర్ ఫ్యాక్ట‌రీ యాజ‌మాన్యం స్థానిక ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెబుతూ లేఖ విడుద‌ల చేసింది. మంగ‌ళ‌వారం ఈ లీక్ మొద‌లు కాగా, మ‌ర‌మ్మ‌తుల అనంత‌రం ఇది ఆగిపోయింది. ఈ ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు చేప‌ట్టిన‌ట్లు బీర్ ఫ్యాక్ట‌రీ వెల్ల‌డించింది. పైనాపిల్ తోట‌ల‌కు నాగో సిటీ ప్ర‌సిద్ధి.