Japan | ప్ర‌యోగానికి ముందే పేలిన‌ జపాన్ రాకెట్ ఇంజ‌న్

Japan టోక్యో- జ‌పానులో శుక్ర‌వారంనాడు ఉప‌గ్ర‌హ ప్ర‌యోగం సంద‌ర్భంగా రాకెట్ ఇంజ‌ను పేలిపోయింది. ఉత్త‌ర జ‌పానులోని అంత‌రిక్ష ప్ర‌యోగ కేంద్రం జ‌క్సాలో ఈ సంఘ‌ట‌న జ‌రిగిన‌ట్టు జ‌పాను శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది. గ‌త సంవ‌త్స‌ర‌కాలంలో జ‌రిగిన ప‌లు ప్ర‌యోగ‌ వైఫ‌ల్యాల‌లో ఇది తాజాది. రెండ‌వ ద‌శ ఇంజ‌ను ప‌రీక్ష మ‌రో నిమిషంలో జ‌రుగునున్న‌ద‌న‌గా ఈ రాకెట్ ఇంజ‌ను పేలిపోయింది. Japan space agency rocket engine explodes during test.#japan #space #rocket pic.twitter.com/0xbKnYVnHU […]

Japan | ప్ర‌యోగానికి ముందే పేలిన‌ జపాన్ రాకెట్ ఇంజ‌న్

Japan

టోక్యో- జ‌పానులో శుక్ర‌వారంనాడు ఉప‌గ్ర‌హ ప్ర‌యోగం సంద‌ర్భంగా రాకెట్ ఇంజ‌ను పేలిపోయింది. ఉత్త‌ర జ‌పానులోని అంత‌రిక్ష ప్ర‌యోగ కేంద్రం జ‌క్సాలో ఈ సంఘ‌ట‌న జ‌రిగిన‌ట్టు జ‌పాను శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది. గ‌త సంవ‌త్స‌ర‌కాలంలో జ‌రిగిన ప‌లు ప్ర‌యోగ‌ వైఫ‌ల్యాల‌లో ఇది తాజాది. రెండ‌వ ద‌శ ఇంజ‌ను ప‌రీక్ష మ‌రో నిమిషంలో జ‌రుగునున్న‌ద‌న‌గా ఈ రాకెట్ ఇంజ‌ను పేలిపోయింది.


అంత‌రిక్ష కేంద్రంలోని ఒక విభాగంలో ఇంజ‌ను పేలిపోయి మంట‌లు ఎగ‌సిప‌డుతున్న ద్రుశ్యం టీవీ వార్త‌ల్లో క‌నిపించింది. ఆ విభాగం భ‌వ‌నం పూర్తిగా మంట‌ల్లో కాలిపోయింది. ఈ యేడాది మార్చిలో మ‌ధ్య‌త‌ర‌హా రాకెట్ ప్ర‌యోగం కూడా విఫ‌ల‌మ‌యింది. ఆ త‌ర్వాత మ‌రో నెల‌రోజుల‌కు మ‌రో ప్ర‌యోగం కూడా విఫ‌ల‌మ‌యింది.