కొంతమంది యాక్టర్స్ కారణంగానే.. ‘సరొగసి’పై జయమ్మ!
విధాత, సినిమా: వరలక్ష్మీ శరత్ కుమార్.. టాలెంటెడ్ నటీమణులలో ఓ మణి ఈ పేరు. ఇప్పుడామె కోసం ప్రత్యేకంగా పాత్రలు రాస్తున్నారంటే.. ఆమె రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల వచ్చిన రవితేజ ‘క్రాక్’ సినిమాలో అయితే జయమ్మగా వరలక్ష్మీ చెలరేగిపోయింది. ఆ సినిమా తర్వాత ఆమె పేరు దాదాపు జయమ్మ గానే మారిపోయింది. ఆ ఒక్క సినిమా అనే కాదు.. ఆమె నటించే ప్రతి సినిమాలోనూ ఆమె పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉండటమే కాకుండా.. […]

విధాత, సినిమా: వరలక్ష్మీ శరత్ కుమార్.. టాలెంటెడ్ నటీమణులలో ఓ మణి ఈ పేరు. ఇప్పుడామె కోసం ప్రత్యేకంగా పాత్రలు రాస్తున్నారంటే.. ఆమె రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల వచ్చిన రవితేజ ‘క్రాక్’ సినిమాలో అయితే జయమ్మగా వరలక్ష్మీ చెలరేగిపోయింది.
ఆ సినిమా తర్వాత ఆమె పేరు దాదాపు జయమ్మ గానే మారిపోయింది. ఆ ఒక్క సినిమా అనే కాదు.. ఆమె నటించే ప్రతి సినిమాలోనూ ఆమె పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉండటమే కాకుండా.. ఆ పాత్రలు కూడా చాలా వైవిధ్యంగా ఉంటున్నాయి.
వాస్తవానికి వరలక్ష్మీ అనగానే.. ఆమెను గ్లామర్‌గా చూపించాలని దర్శకుడికి, అలా చూడాలని ప్రేక్షకులకు ఉంటుంది. కానీ ఆ గ్లామర్ థాట్‌ని చెరి పేసి తనొక మంచి నటిగా వరలక్ష్మీ శరత్ కుమార్ గుర్తింపును తెచ్చుకుంటుంది. తాజాగా ఆమె నటించిన చిత్రం ‘యశోద’. నవంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న ఈ చిత్రం ‘సరొగసి’ బేస్డ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కినట్లుగా ఇప్పటికే విడుదలైన ట్రైలర్ తెలియజేసింది.
స్టార్ హీరోయిన్ సమంత ఇందులో నటించడం.. అలాగే ‘సరొగసి’ విషయంలో నయనతార దంపతుల పేర్లు వైరల్ అవడం.. అదే టైమ్‌లో ట్రైలర్ రావడంతో.. అంతా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటు న్నారు. ఇక ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా.. మీడియాతో మాట్లాడిన జయమ్మ.. ‘సరొగసి’ విధానంపై సంచలన కామెంట్స్ చేసింది.
ముందుగా ఈ సినిమాలో తన పాత్ర గురించి చెబుతూ.. ‘‘యశోద సినిమాలో నేను డాక్టర్‌ను కాదు. ట్రైలర్‌లో చూపించిన సరొగసి ఫెసిలిటీ సెంటర్ హెడ్‌ని. ఆమె చాలా రిచ్. డబ్బులు అంటే ఇష్టం. నిజ జీవితంలో నా డ్రసింగ్ స్టైల్, ఇతర అంశాలకు పూర్తి విరుద్ధంగా ఆ పాత్రను డిజైన్ చేశారు. తనను తాను బాగా ప్రేమించుకునే పాత్ర..’’ అని తెలిపింది.
ఈ కథ గురించి.. అలాగే ప్రస్తుతం సరొగసి విధానంపై వినిపిస్తున్న వార్తల గురించి ఆమె మాట్లాడుతూ.. ‘‘సరొగసి కాంప్లికేటెడ్ ఏమీ కాదు. కొంతమంది యాక్టర్స్ సరొగసిని ఆశ్రయించడం వల్ల డిస్కషన్స్ జరుగుతున్నాయంతే. పిల్లలు లేని చాలా మందికి సరొగసి ద్వారా పొందే అవకాశం కలుగుతోంది. ఈ కథలో సరొగసి ఒక టాపిక్ అంతే! అందులో మంచి చెడుల గురించి చెప్పడం లేదు. ఇది ఫిక్షనల్ స్టోరీ. కానీ, సమాజంలో అటువంటి మనుషులు ఉన్నారని అనిపిస్తుంది.’’ అని చెప్పుకొచ్చింది.