Visakha Steel | విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్‌లో.. JD లక్ష్మీనారాయణ

విధాత: మొత్తానికి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ అంశం అందర్నీ అప్రమత్తం చేస్తోంది. అన్ని పార్టీలూ ఎలర్ట్ అయ్యి, ఏదోవిధంగా దాన్నుంచి లబ్ది పొందాలని చూస్తుండగా కేంద్రం మాత్రం ప్రైవేటీ కరణ అంశంలో వెనక్కు తగ్గేది లేదని చెబుతోంది. ఇక నిధులు, ఇతరత్రా సపోర్ట్ అందించే పెద్ద సంస్థలు తమ ఆసక్తిని వ్యక్తీకరించేందుకు ఈరోజే ఆఖరు తేదీగా కేంద్రం ప్రకటించగా ఈ ప్రైవేటీకరణ అంశం ఆంధ్రప్రదేశ్‌లో.. ముఖ్యంగా విశాఖ, ఉత్తరాంధ్రలో సెగలు రేపుతోంది. దాదాపు 35 మంది […]

  • By: krs    latest    Apr 16, 2023 2:15 AM IST
Visakha Steel | విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్‌లో.. JD లక్ష్మీనారాయణ

విధాత: మొత్తానికి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ అంశం అందర్నీ అప్రమత్తం చేస్తోంది. అన్ని పార్టీలూ ఎలర్ట్ అయ్యి, ఏదోవిధంగా దాన్నుంచి లబ్ది పొందాలని చూస్తుండగా కేంద్రం మాత్రం ప్రైవేటీ కరణ అంశంలో వెనక్కు తగ్గేది లేదని చెబుతోంది. ఇక నిధులు, ఇతరత్రా సపోర్ట్ అందించే పెద్ద సంస్థలు తమ ఆసక్తిని వ్యక్తీకరించేందుకు ఈరోజే ఆఖరు తేదీగా కేంద్రం ప్రకటించగా ఈ ప్రైవేటీకరణ అంశం ఆంధ్రప్రదేశ్‌లో.. ముఖ్యంగా విశాఖ, ఉత్తరాంధ్రలో సెగలు రేపుతోంది.

దాదాపు 35 మంది ఆత్మల బలిదానం తరువాత ఏర్పాటైన ఈ సంస్థను ప్రయివేటుకు అమ్మేయడం ఈ ప్రాంతవాసులు కలచివేస్తోంది. ఇక ఇప్పుడు దీన్ని దక్కించుకునేందుకు పలు ప్రయివేటు ఉక్కు సంస్థలు బిడ్డింగ్ వేస్తున్నట్టు తెలుస్తోంది. జిందాల్, టాటా ఇతర కొన్ని సంస్థలు ఈ ప్రక్రియలో పాల్గొనేందుకు అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా ఈ కంపెనీని మెం కాపాడుతాం అంటూ మొన్న కేసీఆర్ తరఫున హరీష్ రావు, కేటీఆర్ వంటి వారు చేసిన ప్రకటనలు సైతం వట్టివే అని తేలిపోయాయి. అసలు ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు ఈ బిడ్డింగ్‌లో.. ఆసక్తి వ్యక్తీకరణ ప్రక్రియలో పాల్గొనేందుకు ఛాన్స్ లేదని కేంద్రం నిబంధనల్లో స్పష్టం చేయగా ఇక సింగరేణి సంస్థ వచ్చి ఈ ఉక్కు పరిశ్రమను నడిపేది అయ్యేది కాదని తెలుస్తోంది.

ఇదిలా ఉండగా ప్రజల తరఫున తానూ ఈ బిడ్డింగులో పాల్గొంటానని మాజీ సీబీఐ జేడీ వివి లక్ష్మీనారాయణ చెప్పారు. ప్రభుత్వ ఆస్తుల ప్రయివేటీకరణకు తాను బద్ధ వ్యతిరేకిని అని చెబుతున్న జేడీ ప్రజల తరఫున తాను ఈ బిడ్డింగులో పాల్గొని ప్రజల మనోభీష్టాన్ని కేంద్రానికి ఎలుగెత్తి చాటుతానని అంటున్నారు.

గత ఎన్నికల్లో జనసేన తరఫున విశాఖ ఎంపీగా పోటీ చేసిన జేడీ అక్కడ దాదాపు రెండున్నర లక్షల ఓట్లు సాధించి విద్యావంతులు, విద్యార్థులఅభిమానాన్ని చూరగొన్నారు. ఈసారి కూడా మళ్ళీ విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేస్తానని అంటున్న జేడీ కి ఏ పార్టీ కూడా పిలిచి సీట్ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు.

అయినా సరే ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేసి ప్రజల తరఫున పోరాడతానని జేడీ అంటున్నారు. అందుకే స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్‌లో పాల్గొంటానని అంటున్నారు. అసలు ఈ బిడ్డింగ్‌లో ఎవరెవరు పాల్గొన్నది త్వరలో వెల్లడి కానుంది.