Congress | రేవంత్‌రెడ్డిని.. కలిసిన యెన్నం, జిట్టా
Congress | విధాత: బీజేపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డిలు మంగళ వారం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిశారు. గత కొన్ని రోజులుగా వారిద్ధరూ కాంగ్రెస్‌లో చేరబోతున్నారన్న ప్రచారం నేపధ్యంలో తాజాగా వారు రేవంత్‌తో భేటీ కావడం ప్రాథాన్యత సంతరించుకుంది. జిట్టా, యెన్నంలకు వారి సొంత నియోజక వర్గాలు భువనగిరి, మహబూబ్‌నగర్ స్థానాల్లో కాంగ్రెస్ టికెట్లపై భరోసా లభించిన నేపధ్యంలో వారు కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. […]

Congress |
విధాత: బీజేపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డిలు మంగళ వారం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిశారు. గత కొన్ని రోజులుగా వారిద్ధరూ కాంగ్రెస్‌లో చేరబోతున్నారన్న ప్రచారం నేపధ్యంలో తాజాగా వారు రేవంత్‌తో భేటీ కావడం ప్రాథాన్యత సంతరించుకుంది.
జిట్టా, యెన్నంలకు వారి సొంత నియోజక వర్గాలు భువనగిరి, మహబూబ్‌నగర్ స్థానాల్లో కాంగ్రెస్ టికెట్లపై భరోసా లభించిన నేపధ్యంలో వారు కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. బహుశా వారు ఈ నెల 17న తుక్కుగూడలో జరిగే సోనియాగాంధీ బహిరంగ సభ సందర్భంగా కాంగ్రెస్‌లో అధికారికంగా చేరుతారని భావిస్తున్నారు.
అయితే ప్రతి పార్లమెంటు స్థానంలో రెండు సీట్లు బీసీలకు ఇవ్వాలన్న ప్రతిపాదన నేపధ్యంలో భువనగిరి సీటు బీసీలకు ఇస్తారని నిన్నటిదాకా జరిగిన ప్రచారం నేపధ్యంలో ఇప్పటికే ఈ నియోజకవర్గం కాంగ్రెస్ టికెట్ ఆశించిన కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి పార్టీకి గుడ్ బై కొట్టి బీఆరెస్‌లో చేరారు. ఇప్పుడు జిట్టా కోసం పార్టీ తన నిర్ణయం మార్చుకుంటుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.