బీజేపీతోనే తెలంగాణలో అభివృద్ధి: నడ్డా
తెలంగాణలో బీజేపీ గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుందని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షులు జయప్రకాశ్ నడ్డా అన్నారు

- మార్పు కోరుకుంటున్న జనం
- ఉద్యమకారులను పట్టించుకోని బీఆరెస్
- కేసీఆర్ కుటుంబమే బాగుపడింది
- బీజేపీ జాతీయ అధ్యక్షులు జయప్రకాశ్ నడ్డా
విధాత ప్రతినిధి, నిజామాబాద్: . నిజామాబాద్ గిరిరాజ్ డిగ్రీ కళాశాల మైదానంలో బీజేపీ సకల జనుల విజయసంకల్ప సభ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన నడ్డా మాట్లాడుతూ తెలంగాణ కోసం పోరాటాలు చేసి, జీవితం త్యాగాలు చేసిన వారిని కేసీఆర్ పట్టించుకోలేదన్నారు. కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడ్డద్దని, తెలంగాణను అవినీతిలో ముంచారన్నారు.
బీజేపీ పట్ల నిజామాబాద్ ప్రజలు చూపుతున్న ఉత్సాహం అభివృద్ధి ఆధారిత రాజకీయాలకు తమ బలమైన మద్దతుని ముద్రిస్తున్నారు.
కేసీఆర్ పాలనలో దుష్పరిపాలన, బుజ్జగింపులు, ప్రజాసంక్షేమాన్ని అణగదొక్కడం వంటి లక్షణాలున్నాయి. అదే సమయంలో, అతని ఏకైక దృష్టి అతని కుటుంబ ప్రయోజనాలను మరింతగా పెంచడం.… pic.twitter.com/J5BSST9jnm
— Jagat Prakash Nadda (@JPNadda) November 23, 2023
అభివృద్ధి వెనుక్కు పోయి, పదేళ్లలో నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవన్నారు. దేశంలో మొత్తం కుటుంబ వ్యవస్థ పోవాలని బీజేపీ పోరాటం చేస్తోందన్నారు. జమ్మూకాశ్మీర్ లో ఫారూఖ్ అబ్దుల్లా, పంజాబ్ లో ప్రకాష్ సింగ్ బాదల్, ఉత్తర ప్రదేశ్ లో ములాయం, అఖిలేష్, బీహార్ లో లాలూ, బెంగాల్ లో మమత అల్లుడు, ఏపీలో వైయస్సార్.. ఇప్పుడు జగన్, తెలంగాణలో కేసీఆర్, కేటీఆర్, కవిత కుటుంబం పార్టీలకు వ్యతిరేకంగా బీజేపీ పనిచేస్తోందన్నారు. సబ్కా సాత్ , సబ్కా విశ్వాస్, సబ్కా వికాస్ అన్నారు.
కేసీఆర్ అవినీతి రాజకీయాలు చేస్తే, మోడీ నీతి రాజకీయాలు చేస్తున్నారని చెపాపరు. ఒక వర్గానికి 4% రిజర్వేషన్ 12% చేయాలని చూస్తున్నారని అన్నారు. ధరణి పోర్టల్ పోవాలంటే బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ ఏటీఎంగా వాడుకున్నారని, వారి అవినీతికి మేడిగడ్డ ప్రాజెక్ట్ కృంగిపోయిందన్నారు. 692 ఎకరాలు మియాపూర్ భూములోల కేసీఆర్ స్కామ్ చేశారని ఆరోపించారు. దళిత బంధులో 30% కమీషన్ తీసుకున్నారన్నారు.
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను కేసీఆర్ తెలంగాణలో అమలు చేయలేదని, ప్రధానమంత్రి ఆవాస్ యోజనను డబల్ బెడ్ రూములుగా మార్చారని తెలిపారు. 80 కోట్ల మంది భారతీయులకు ఉచిత రేషన్ పంపిణీ, నాలుగు కోట్ల ఇళ్లు మోడీ ప్రభుత్వంలో నిర్మించినట్లు పేర్కొన్నారు. ఒక వర్గానికి ఇచ్చే రిజర్వేషన్ తీసేసి, బీసీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇస్తామని తెలిపారు. ప్రధాని మోడీ పసుపు బోర్డ్ ప్రకటించారని, పసుపు కు మద్దతు ధర కల్పిస్తాం, రూ.3100 వరి ధాన్యానికి ఇస్తామని అన్నారు. కేసీఆర్ హయాంలో వెనక్కు పోయిన తెలంగాణ అభివృద్ధి చెందాలంటే బీజేపీ అధికారంలోకి రావాలన్నారు.
ఈనెల 30న జరిగే పోలింగ్ లో నిజామాబాద్ అర్బన్ లో ధన్పాల్ సూర్యనారాయణను, నిజామాబాద్ రూరల్ లో కులాచారి దినేష్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా జేపీ నడ్డా ఆధ్వర్యంలో నుడా డైరెక్టర్ అంబాదాస్, బీఆరెస్ నాయకులు ఇంధల్వాయి కిషన్, చెరుకు లక్ష్మణ్ గౌడ్, డివిజన్ ప్రెసిడెంట్ గంగాధర్, పద్మశాలి నగర అధ్యక్షులు బింగి మోహన్ బీజేపీలో చేరారు. వారికి ఆయన కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.