బన్నీ వాసు మోసం చేశాడు.. గీతా ఆర్ట్స్ ఆఫీస్ ఎదుట అర్ధ నగ్నంగా నిరసన

Sunitha Boya | విధాత: జూనియ‌ర్ ఆర్టిస్ట్ సునీత బోయ అనే మ‌హిళ మ‌రోసారి వార్త‌ల్లో నిలిచింది. ఎందుకంటే గీతా ఆర్ట్స్ కార్యాల‌యం ముందు సునీత బోయ నిన్న రాత్రి అర్ధ న‌గ్నంగా బైఠాయించింది. గ‌తంలో శ్రీరెడ్డి ఫిలిం ఛాంబ‌ర్ ముందు న‌గ్నంగా బైఠాయించి హల్‌చ‌ల్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ మాదిరిగానే సునీత బోయ కూడా అర్ధ న‌గ్నంగా బైఠాయించి హ‌ల్‌చ‌ల్ చేసింది. దాదాపు 45 నిమిషాల పాటు నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ప్రొడ్యూసర్ బన్నీ […]

బన్నీ వాసు మోసం చేశాడు.. గీతా ఆర్ట్స్ ఆఫీస్ ఎదుట అర్ధ నగ్నంగా నిరసన

Sunitha Boya | విధాత: జూనియ‌ర్ ఆర్టిస్ట్ సునీత బోయ అనే మ‌హిళ మ‌రోసారి వార్త‌ల్లో నిలిచింది. ఎందుకంటే గీతా ఆర్ట్స్ కార్యాల‌యం ముందు సునీత బోయ నిన్న రాత్రి అర్ధ న‌గ్నంగా బైఠాయించింది. గ‌తంలో శ్రీరెడ్డి ఫిలిం ఛాంబ‌ర్ ముందు న‌గ్నంగా బైఠాయించి హల్‌చ‌ల్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ మాదిరిగానే సునీత బోయ కూడా అర్ధ న‌గ్నంగా బైఠాయించి హ‌ల్‌చ‌ల్ చేసింది. దాదాపు 45 నిమిషాల పాటు నిర‌స‌న వ్య‌క్తం చేశారు.

ప్రొడ్యూసర్ బన్నీ వాసుతో సునీత బోయకు గ‌త కొద్ది రోజుల నుంచి వివాదాలు కొన‌సాగుతున్నాయి. అయితే కొన్ని నెలల క్రితం బన్నీవాసు త‌న‌ను మోసం చేశారంటూ సునీత బోయ గొడవ‌కు దిగిన విష‌యం తెలిసిందే. మ‌ళ్లీ నిన్న రాత్రి గీతా ఆర్ట్స్ ఆఫీసు ముందు అర్ధ న‌గ్న ప్ర‌ద‌ర్శ‌న చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

బ‌న్నీ వాసు త‌న‌ను వాడుకొని వ‌దిలేశాడ‌ని సునీత 10 నెల‌ల క్రితం బంజారాహిల్స్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన సంగ‌తి తెలిసిందే. పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. అయితే ఈ కేసు హైకోర్టుకు చేరింది. స‌రైన సాక్ష్యాలు లేక‌పోవ‌డంతో కేసును కోర్టు కొట్టేసింది.

అయితే తాజాగా బ‌న్నీ వాసు త‌న‌ను లైంగికంగా వేధిస్తున్నాడ‌ని సునీత బోయ వాపోయింది. త‌న‌ను చంప‌డానికి నాలుగు సార్లు య‌త్నించిన‌ట్లు ఆమె ఆరోపించింది. బ‌న్నీ వాసుకు శిక్ష ప‌డే వ‌ర‌కు వ‌ద‌ల‌న‌ని చెప్పిందామె. అయితే గీతా ఆర్ట్స్ ఆఫీస్ ముందే ఎందుకిలా చేసింది అనేదానికి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. దీనిపై మరి పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారు. అలాగే బన్నీవాసు ఏమంటారో చూడాలి.