శుభ సంక‌ల్పం సినిమాతో న‌టుడిగా మారిన కె. విశ్వ‌నాథ్

K. Vishwanath | తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కు అపురూప చిత్రాలు అందించిన దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు, క‌ళాత‌పస్వి కె. విశ్వ‌నాథ్ ఇక లేరు. ఆయ‌న ద‌ర్శ‌కుడిగానే ఉండిపోలేదు. న‌ట‌న వైపు కూడా వ‌చ్చారు. ద‌ర్శ‌కుడిగా న‌టుల‌కు శిక్ష‌ణ ఇచ్చిన విశ్వ‌నాథ్‌.. త‌ర్వాత నటుడిగా మురిపించిన వైనం మ‌రుపురానిది. కే విశ్వ‌నాథ్ తొలి సినిమాకు నంది.. ఏ సినిమా అంటే..? 'శుభ సంకల్పం' సినిమాతో విశ్వ‌నాథ్ నటుడిగా మారారు. ద‌ర్శ‌క‌త్వం కూడా ఆయ‌నే. ఈ సినిమా విడుద‌లైన త‌ర్వాత […]

శుభ సంక‌ల్పం సినిమాతో న‌టుడిగా మారిన కె. విశ్వ‌నాథ్

K. Vishwanath | తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కు అపురూప చిత్రాలు అందించిన దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు, క‌ళాత‌పస్వి కె. విశ్వ‌నాథ్ ఇక లేరు. ఆయ‌న ద‌ర్శ‌కుడిగానే ఉండిపోలేదు. న‌ట‌న వైపు కూడా వ‌చ్చారు. ద‌ర్శ‌కుడిగా న‌టుల‌కు శిక్ష‌ణ ఇచ్చిన విశ్వ‌నాథ్‌.. త‌ర్వాత నటుడిగా మురిపించిన వైనం మ‌రుపురానిది.

కే విశ్వ‌నాథ్ తొలి సినిమాకు నంది.. ఏ సినిమా అంటే..?

‘శుభ సంకల్పం’ సినిమాతో విశ్వ‌నాథ్ నటుడిగా మారారు. ద‌ర్శ‌క‌త్వం కూడా ఆయ‌నే. ఈ సినిమా విడుద‌లైన త‌ర్వాత విశ్వ‌నాథ్ వైపు పాత్రలు ప‌రుగులు పెడుతూ వ‌చ్చాయి. పలు చిత్రాల్లో పాత్రలకు ప్రాణం పోశారు.

శంక‌రాభ‌ర‌ణం చిత్రంతో విశ్వ‌నాథ్ క‌ళాత‌పస్విగా పేరొందారు..

విశ్వనాథ్ అనేది తెలుగు చిత్రసీమలో ఒక పేరు కాదు, చరిత్ర అని చెప్పొచ్చు. తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో క‌ళాత‌పస్వి న‌టించి, మెప్పించారు. ఇక ద‌ర్శ‌క‌త్వం వైపు ఆయ‌న చూడ‌లేదు. న‌ట‌న వైపే త‌న దృష్టిని సారించారు.

ఎనిమిది సార్లు ఆయన ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్ ఫేర్ పురస్కారం అందుకున్నారు. ఆయన్ను 1994లో జీవిత సాఫల్య పురస్కారంతో ఫిల్మ్ ఫేర్ సత్కరించింది. ఆయన మరణం చిత్రసీమకు తీరని లోటు.

క‌ళాత‌ప‌స్వి కె. విశ్వ‌నాథ్ క‌న్నుమూత‌