కే విశ్వ‌నాథ్ తొలి సినిమాకు నంది.. ఏ సినిమా అంటే..?

K Vishwanath | తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో దిగ్గ‌జ ద‌ర్శకులుగా పేరొందిన కే విశ్వ‌నాథ్ క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. 50కి పైగా చిత్రాల‌కు ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సినీ ప్ర‌స్థానంలో భాగంగా ఆయ‌న త‌న కెరీర్‌ను సౌండ్ రికార్డిస్ట్‌గా ప్రారంభించినప్ప‌టికీ, ఆ త‌ర్వాత ద‌ర్శ‌క‌త్వం వైపు అడుగులు వేశారు. శుభ సంక‌ల్పం సినిమాతో న‌టుడిగా మారిన కె. విశ్వ‌నాథ్ అయితే విశ్వ‌నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన తొలి సినిమా ఆత్మ‌గౌర‌వం. ఈ మూవీకి నంది పుర‌స్కారాల్లో భాగంగా […]

కే విశ్వ‌నాథ్ తొలి సినిమాకు నంది.. ఏ సినిమా అంటే..?

K Vishwanath | తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో దిగ్గ‌జ ద‌ర్శకులుగా పేరొందిన కే విశ్వ‌నాథ్ క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. 50కి పైగా చిత్రాల‌కు ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సినీ ప్ర‌స్థానంలో భాగంగా ఆయ‌న త‌న కెరీర్‌ను సౌండ్ రికార్డిస్ట్‌గా ప్రారంభించినప్ప‌టికీ, ఆ త‌ర్వాత ద‌ర్శ‌క‌త్వం వైపు అడుగులు వేశారు.

శుభ సంక‌ల్పం సినిమాతో న‌టుడిగా మారిన కె. విశ్వ‌నాథ్

అయితే విశ్వ‌నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన తొలి సినిమా ఆత్మ‌గౌర‌వం. ఈ మూవీకి నంది పుర‌స్కారాల్లో భాగంగా సినిమా విభాగంలో కాంస్య బ‌హుమ‌తి ల‌భించింది. ఈ చిత్రం క‌థ‌కు కూడా నంది అవార్డు వ‌రించింది.

ఈ సినిమా విజ‌యంతో.. చెల్లెలి కాపురం, శార‌దా, ఓ సీత క‌థ‌, జీవ‌న జ్యోతి వంటి చిత్రాల‌ను తీశారు. ఈ సినిమాలు కూడా ఉత్త‌మ సినిమా విభాగంలో నంది అవార్డుల‌ను అందుకున్నాయి. ఇవే కాకుండా చాలా సినిమాలు కూడా నంది అవార్డుల‌ను సొంతం చేసుకున్నాయి.

శంక‌రాభ‌ర‌ణం చిత్రంతో విశ్వ‌నాథ్ క‌ళాత‌పస్విగా పేరొందారు..

1992లో ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారం..

టాలీవుడ్‌కు విశ్వ‌నాథ్ చేసిన సేవల‌కు గానూ భార‌త ప్ర‌భుత్వం ఆయ‌నను గుర్తించింది. 1992లో ప‌ద్మ శ్రీ పుర‌స్కారంతో ఆయ‌న‌ను గౌర‌వించింది. విశ్వ‌నాథ్ కేవ‌లం తెలుగు సినిమాల‌కే ప‌రిమితం కాలేదు. హిందీ మూవీస్‌కు కూడా డైరెక్ట‌ర్‌గా ప‌ని చేశారు.

క‌ళాత‌ప‌స్వి కె. విశ్వ‌నాథ్ క‌న్నుమూత‌